ఈ ఇయర్ తెలుగులో సూపర్ హిట్టైయిన తొలి చిత్రం ‘ఎఫ్ 2’. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు రూ.120 కోట్ల గ్రాస్,రూ.80 షేర్‌ను రాబట్టి ట్రేడ్ పండితులను ఔరా అనిపించింది. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్లో నవ్వులు పూయించాడో తెలిసిందే కదా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు.అంతేకాదు సూపర్ హిట్టైన ‘ఎఫ్ 2’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ సినిమాను తెరకెక్కించాలనే ప్లాన్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సీక్వెల్‌ను కూడా దిల్ రాజు నిర్మించే అవకాశాలున్నాయి. ఈ సీక్వెల్లో వెంకటేష్, వరుణ్ తేజ్‌తో పాటు నితిన్ హీరోగా నటించే అవకాశాలున్నాయి. తెలుగులో బంపర్ హిట్టైన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. హిందీలో ఈ సినిమాను బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

దిల్ రాజు, అనిల్ రావిపూడి
హిందీలో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనీస్ బజ్మీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడట. ఈ సినిమాలో తోడల్లుళ్లుగా నటించే హీరోలెవరనేది తొందర్లేనే అఫీషియల్‌గా డిక్లేర్ చేస్తారట. హిందీలో కూడా ఈ సినిమాకు ఎఫ్ 2 అనే టైటిల్ అనుకుంటున్నారు. మొత్తానికి తెలుగులో సూపర్ హిట్టైయిన ఈ సినిమా బాలీవుడ్లో ఎలాంటి సంచలనాలు నమెదు చేస్తుందో చూడాలి.