సమంత ‘ఓ బేబి’ వేడుకకు ముఖ్య అతిథులుగా బాబాయి అబ్బాయి..

‘ఓ బేబి’ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ వేడుకకు వెంకటేశ్,రానా ముఖ్యఅతిథిలుగా వస్తున్నట్టు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసారు

news18-telugu
Updated: June 29, 2019, 11:21 AM IST
సమంత ‘ఓ బేబి’ వేడుకకు ముఖ్య అతిథులుగా బాబాయి అబ్బాయి..
సమంత అక్కినేని (Source: Twitter)
  • Share this:
ఈ యేడాది సమంతకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సూపర్ సక్సెస్ కావడంతో ఫుల్ హ్యాపీగా ఉంది. అంతేకాదు ఇపుడు అదే జోష్‌లో ఈ భామ యాక్ట్ చేసిన ‘ఓ బేబి’ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ వేడుకకు వెంకటేశ్,రానా ముఖ్యఅతిథిలుగా వస్తున్నట్టు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో  నందిని రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమా కొరియాలో హిట్టైయిన ‘మిస్ గ్రానీ’ రీమేక్‌గా తెరకెక్కించినట్టు చెబుతున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ వేడుకకు వెంకటేశ్,రానా ముఖ్యఅతిథిలుగా వస్తున్నట్టు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసారు
ఓ బేబి ప్రీ రిలీజ్ ఈవెంట్


మరి వెంకటేష్ అతిథిగా వెళ్లిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవుతున్నాయి. ‘మజిలీ’, ‘జెర్సీ’, ‘మహర్షి’ సినిమాలకు వెంకటేష్ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఇపుడు అదే రూట్లో ఈ సినిమాకు అబ్బాయి రానాతో కలిసి వస్తున్నాడు. మరి సెంటిమెంట్ వర్కౌటౌ ‘ఓ బేబి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు మాయ చేస్తుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 29, 2019, 11:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading