‘వెంకీ మామ’తో తన కోరిక నెరవేరిందన్న వెంకటేష్..

ఇన్నేళ్ల వెంకటేష్ ఫిల్మ్ కెరీర్‌లో ‘వెంకీ మామ’ తో తన  తండ్రి దివంగత రామానాయుడు కోరిక నెరవేరిందని ‘వెంకీ మామ’ ఆడియో వేదికగా ప్రకటించారు.

news18-telugu
Updated: December 5, 2019, 12:51 PM IST
‘వెంకీ మామ’తో తన కోరిక నెరవేరిందన్న వెంకటేష్..
వెంకీ మామ (Twitter/Photo)
  • Share this:
ఇన్నేళ్ల వెంకటేష్ ఫిల్మ్ కెరీర్‌లో ‘వెంకీ మామ’ తో తన  తండ్రి దివంగత రామానాయుడు కోరిక నెరవేరిందని ‘వెంకీ మామ’ ఆడియో వేదికగా ప్రకటించారు. ఈ సినిమా వెంకటేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న విడుదల కానుంది. ఈ సినిమాతో నేను నాగ చైతన్యతో పూర్తి స్థాయిలో కలిసి నటించాను. ఎందుకంటే నేను ఎపుడు రానా, నాగ చైతన్యలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. నాన్న (రామానాయుడు)కూడా నేను రానా, నాగ చైతన్యలతో కలిసి నటిస్తే చూడాలనుకున్నారు. అంతేకాదు.. ఆయన తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మా అందరితో సినిమా తీయాలనుకున్నారు. ఆ కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. ఆయన ఉండి ఉంటే ఈ సినిమా చూసి ఎంతో ఆనందించే వారన్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక చైతూ కెరీర్‌లోనే బెస్ట్ రోల్ అవ్వాలని మా అన్న సురేష్ బాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్టట్టు చెప్పుకొచ్చారు.  అనుకున్నట్టే ఈ సినిమాలో చైతూ క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చుతుందున్నారు.

First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>