Venkatesh: నారప్ప, ఎఫ్ 3తో పాటు మరో క్రేజీ రీమేక్‌‌లో విక్టరీ వెంకటేష్.. ?

విక్టరీ వెంకటేష్ (Twitter/Photo)

Venkatesh: సీనియర్ హీరో వెంకటేష్ .. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు.దాంతో పాటు ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత వెంకటేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.

  • Share this:
    Venkatesh: సీనియర్ హీరో వెంకటేష్ .. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం తమిళంలో ధనుశ్ హీరోగా హిట్టైన ‘అసురన్’ మూవీకి రీమేక్. ఈ  సినిమాలో వెంకటేష్.. లుక్ సహా అన్ని కొత్తగా కనిపిస్తున్నాయి. పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 14న విడుదల చేస్తున్నారు. దానికి ఒక రోజు ముందు చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సినిమా విడుదల కానుంది. దీంతో వెంకటేష్ అదే డేట్‌లో తన సినిమాను విడుదల చేస్తారా లేకపోతే వేరే డేట్‌లో తన సినిమాను రిలీజ్ చేస్తారా అనేది చూడాలి.

    ఆ సంగతి పక్కన పెడితే... వెంకటేష్ ‘నారప్ప’ సినిమా షూటింగ్‌ను ఈ నెలాఖరు వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి.ఈ చిత్రం తర్వాత వెంకటేష్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ మూవీ  చేస్తున్నాడు. ఇప్పటికే వెంకటేష్.. నారప్పతో పాటు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.



    దాంతో పాటు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాను తరుణ్ భాస్కర్.. గుర్రపు పందాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే.. వెంకటేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్ పై దృష్టి సారించినట్టు సమాచారం. ప్రస్తుతం మలయాళ సూపర్ స్టార్.. దృశ్యం సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నారు. థియేటర్స్ ఓపెన్ అయిన ఈ సినిమాను అమెజాన్ వంటి ఓటీటీలో విడుదల చేయడంపై అక్కడ నిర్మాతలు మోహన్ లాల్ పై ఒకింత ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.

    drishyam 2 trailer,mohanlal drishyam 2 trailer,mohanlal movies,jeethu joseph drishyam 2 trialer,drishyam 2 malayalam trailer,telugu cinema,drishyam 2 amazon prime video,దృశ్యం 2,దృశ్యం 2 ట్రైలర్,దృశ్యం 2 ఫిబ్రవరి 19 అమెజాన్ ప్రైమ్ వీడియో
    దృశ్యం 2 ట్రైలర్ (Drishyam 2 trailer)


    జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన ఈ సినిమాను   ఇప్పటికే తెలుగులో వెంకటేష్, మీనాతో కలిసి ‘దృశ్యం’ పేరుతోనే  రీమేక్ చేసి మంచి విజయాన్నే అందుకున్నాడు.ఆ సంగతి పక్కన పెడితే. .ఈ సినిమాను తెలుగు రీమేక్ పై వెంకటేష్ దృష్టి సారించినట్టు సమాచారం. ఇప్పటికే దృశ్యం తెలుగు రీమేక్‌లో నటించిన వెంకటేష్.. ఇపుడు దృశ్యం 2ను ఎలాగైనా తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఒకవేళ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే.. ఎవరు డైరెక్ట్ చేస్తారనేది చూడాలి. ఏమైనా ‘దృశ్యం2’ రీమేక్ పై అఫీషియల్ ప్రకటన వెలుబడే వరకు వెయిట్ చేయాల్సిందే.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: