హోమ్ /వార్తలు /సినిమా /

Ori Devuda Movie Review: వెంకటేష్, విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే..

Ori Devuda Movie Review: వెంకటేష్, విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే..

ఓరి దేవుడా మూవీ రివ్యూ  (Ori devuda (Photo Twitter)

ఓరి దేవుడా మూవీ రివ్యూ (Ori devuda (Photo Twitter)

Ori Devuda Movie Review : విశ్వక్ సేన్, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన కొత్త సినిమా ఓరి దేవుడా. తెలుగు ప్రేక్షకులను ఓ ప్రత్యేకమైన అనుభూతి కలిగించాలనే టార్గెట్ పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందంటే..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : ఓరి దేవుడా (Ori Devuda)

నటీనటులు : వెంకటేష్,విశ్వక్ సేన్, మిథిలా పార్కర్, ఆశా భట్, మురళి శర్మ, తరుణ్ భాస్కర్ తదితరులు..

ఎడిటర్: విజయ్ ముక్తవరపు

సినిమాటోగ్రఫీ: విధు అయ్యన

సంగీతం: లియోన్ జేమ్స్

నిర్మాత : పీవీపీ, పెరల్ వి పొట్లూరి

దర్శకత్వం: అశ్వత్ మరిముత్తు

విడుదల తేది : 21/10/2022

విశ్వక్ సేన్, వెంకటేష్ ప్రధాన పాత్రల్లో రూపొందిన కొత్త సినిమా ఓరి దేవుడా. తెలుగు ప్రేక్షకులను ఓ ప్రత్యేకమైన అనుభూతి కలిగించాలనే టార్గెట్ పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందంటే..

కథ విషయానికొస్తే..

ఇక స్టోరీ విషయానికొస్తే.. అర్జున్ (విశ్వక్ సేన్), అను (మిథిలా పాల్కర్) ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి దోస్తులు. అనుకోని పరిస్థితుల్లో అనును అర్జున్ ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది. ఆ తర్వాత అర్జున్ ఓ ఉద్యోగం జాయిన్ అవుతాడు. కానీ అక్కడ అతని సీనియర్ అయిన మీరా (ఆశా భట్) ను లవ్ చేస్తాడు. ఈ నేపథ్యంలో అర్జున్ .. అనుకు విడాకులు ఇవ్వాలనుకుంటాడు.మరి నేపథ్యంలో అర్జున్ జీవితంలోకి దేవుడు (వెంకటేష్) ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అర్జున్ జీవితంలో ఏం జరిగిందనేది ఈ సినిమా స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. 

తమిళంలో హిట్టైన ’ఓ మై కడవులే’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. తమిళంలో దర్శకత్వం వహించిన అశ్వత్ మరిముత్తు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. తమిళంలో హిల్లేరియస్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటికి ఇక్కడ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తెరకెక్కించారు. ఫస్టాఫ్ స్లోగా సాగినా.. సెకండాఫ్ పరుగులు పెట్టించింది. ఇక నిర్మాణ విలువలున్నాయి. విధు కెమెరా పనితనం బాగుంది. ఫస్టాఫ్ ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

నటీనటుల విషయానికొస్తే.. 

ఈ సినిమాలో దేవుడి పాత్రలో వెంకటేష్ చక్కగా ఒదిగిపోయాడు. ఈ సినిమాలో ఆయన పాత్రే హైలెట్‌గా నిలిచింది. వెంకటేష్ నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టే వెంకీ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ .. జీవితంలో పైకి రావాలనుకునే ఇప్పటి యూత్ ఎలా ఉన్నాడో అలాంటి పాత్రలో చక్కగా నటించాడు. ఈ సినిమాలో అన్ని రసాలను తన ముఖంలో పలకించాడు. ఇక హీరోయిన్ పాత్రలో నటించిన మిథిలా పార్కర్, ఆశా శెట్టి ఉన్నంతలో పర్వాలేదు. మిగతా పాత్రల్లో నటించిన మురళీ శర్మ, తరుణ్ భాస్కర్ ఉన్నంతలో పర్వాలేదనిపించారు.

ప్లస్ పాయింట్స్.. 

వెంకటేష్ దేవుడి పాత్ర

విశ్వక్ సేన్ నటన

సెకండాఫ్

మైనస్ పాయింట్స్ 

సెకండాఫ్

ఎడిటింగ్

హీరోయిన్ క్యారెక్టర్స్

చివరి మాట : ఓరి దేవుడా .. వెంకీ మార్క్ తో కూడిన ఫాంటసీ డ్రామా..

రేటింగ్ : 2.75

First published:

Tags: Ori Devuda, Venkatesh, Vishwak Sen

ఉత్తమ కథలు