• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • VENKATESH VIJAYASHANTI CLASSIC MOVIE SATHRUVU COMPLETED 30 YEARS AND HERE SOME INTERESTING STORY PK

Venkatesh Sathruvu 30 Years: వెంకటేష్ హిట్ సినిమా ‘శత్రువు’కు 30 ఏళ్లు పూర్తి..

Venkatesh Sathruvu 30 Years: వెంకటేష్ హిట్ సినిమా ‘శత్రువు’కు 30 ఏళ్లు పూర్తి..

వెంకటేష్ శత్రువు సినిమాకు 30 ఏళ్లు (Venkatesh Sathruvu 30 years)

Venkatesh Sathruvu 30 Years: వెంకటేష్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టాయి. మరికొన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండిపోయాయి. అలాంటి సినిమాల్లో శత్రువు కూడా ఒకటి. ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రాజు..

  • Share this:
వెంకటేష్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టాయి. మరికొన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండిపోయాయి. అలాంటి సినిమాల్లో శత్రువు కూడా ఒకటి. ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రాజు నిర్మించిన తొలి చిత్రం ఇదే. అప్పట్లో 'శత్రువు' సినిమా గురించి చాలా చర్చలే నడిచాయి. ఈ చిత్రం చేసేటప్పుడు ఎమ్మెస్ రాజును చాలా మంది నిరుత్సాహ పరిచారు. కానీ కథపై నమ్మకంతో ముందడుగు వేసి హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం విడుదలై జనవరి 2, 2021కి సరిగ్గా 30 ఏళ్లు అయిపోయింది. లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ ఈ సినిమాను తెరకెక్కించాడు. లేడీ అమితాబ్ విజయశాంతి ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఎమ్మెస్ రాజు నిర్మాతగా మారక ముందు ఆయన తండ్రి రాయపరాజు కొన్ని సినిమాను నిర్మించారు. కృష్ణంరాజు, చిరంజీవి హీరోలుగా ఆయన నిర్మించిన 'ప్రేమతరంగాలు' కూడా అందులో ఒకటి. అప్పటి నుంచి కూడా ఎమ్మెస్ రాజుకు సినిమాలు నిర్మించాలని ఆసక్తి.. అక్కడ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటం. అలా ఆ ఉత్సాహంతోనే 1990లో సినిమా నిర్మించే ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
venkatesh,venkatesh sathruvu movie,venkatesh sathruvu movie 30 years completed,venkatesh vijayashanti sathruvu movie 30 years,telugu cinema,venkatesh twitter,వెంకటేష్,వెంకటేష్ విజయశాంతి,వెంకటేష్ విజయశాంతి శత్రువు సినిమాకు 30 ఏళ్లు
వెంకటేష్ శత్రువు సినిమాకు 30 ఏళ్లు (Venkatesh Sathruvu 30 years)

ఈ క్రమంలోనే ఈయన కొన్ని తెలుగుతో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా చూసాడు. వాటితో రాజుకు ఓ ఆలోచన వచ్చింది. దానిని దర్శకుడు కోడి రామకృష్ణకు, రచయిత సత్యమూర్తికి చెప్పాడు. ఆ ఇద్దరి సహకారంతోనే 'శత్రువు' కథ సిద్ధమైంది. 1991 జనవరి 2న విడుదలైన 'శత్రువు' చిత్రం తొలిరోజు నుంచే సూపర్ హిట్ టాక్ అందుకుంది. 'శత్రువు' సినిమా రివర్స్ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. అప్పటి వరకు తెలుగు సినిమాలకు పెద్దగా అలవాటు లేని ఫార్మాట్ ఇది. హాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. దాన్ని మన ప్రేక్షకులకు శత్రువుతో అలవాటు చేసారు. ఈ సినిమా తీసే సమయానికి 'కర్తవ్యం'తో విజయశాంతి పీక్స్‌లో ఉంది.
venkatesh,venkatesh sathruvu movie,venkatesh sathruvu movie 30 years completed,venkatesh vijayashanti sathruvu movie 30 years,telugu cinema,venkatesh twitter,వెంకటేష్,వెంకటేష్ విజయశాంతి,వెంకటేష్ విజయశాంతి శత్రువు సినిమాకు 30 ఏళ్లు
వెంకటేష్ శత్రువు సినిమాకు 30 ఏళ్లు (Venkatesh Sathruvu 30 years)

దానికితోడు వెంకటేష్‌కు కూడా 'బొబ్బిలిరాజా' ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది. దాంతో శత్రువుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే వెంకటేష్ లాయర్‌గా నటించాడు. తనను ఆదరించి, న్యాయవాదిగా తీర్చిదిద్దిన ఓ నిజాయితీ పరుడైన లాయర్‌ను కొందరు దుర్మార్గులు దారుణంగా చంపేస్తారు.. వాళ్లను అంతమొందించడానికి హీరో ఎప్పటికప్పుడు కొత్త పథకం వేస్తూ ఉంటాడు. దానిని ఛేదించి, అతణ్ని చట్టానికి పట్టించాలనే ప్రయత్నంలో ఒకప్పటి అతని ప్రేయసి ఏసీపీగా వచ్చిన విజయశాంతి ఉంటుంది. కానీ తాను అనుకున్నది సాధించిన తర్వాత.. శత్రువులను అందర్నీ చంపేసిన తర్వాతే చట్టానికి లొంగిపోతాడు హీరో.
venkatesh,venkatesh sathruvu movie,venkatesh sathruvu movie 30 years completed,venkatesh vijayashanti sathruvu movie 30 years,telugu cinema,venkatesh twitter,వెంకటేష్,వెంకటేష్ విజయశాంతి,వెంకటేష్ విజయశాంతి శత్రువు సినిమాకు 30 ఏళ్లు
వెంకటేష్ శత్రువు సినిమాకు 30 ఏళ్లు (Venkatesh Sathruvu 30 years)

ఈ సినిమాకు రాజ్ కోటి అందించిన స్వరాలు అదనపు ఆకర్షణ. 'శత్రువు' చిత్రానికి సత్యమూర్తి సంభాషణలు మరింత బలం చేకూర్చాయి. ఇందులో లెజెండరీ కమెడియన్స్ నగేష్, బ్రహ్మానందం ఇందులో తండ్రీకొడుకులుగా నటించారు. హాస్యంతో పాటు, సెంటిమెంట్ కూడా పండించారు.కోట శ్రీనివాసరావు విలనీ శత్రువు సినిమాకు మరో బలం. "అమ్మ సంపంగి రేకు... అల్లాడే పిల్ల షోకు...", "పొద్దున్నే పుట్టింది చందమామ... " పాటలు ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటాయి. ఏదేమైనా కూడా శత్రువుతో నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన మార్గం ఏర్పరుచుకున్నాడు ఎమ్మెస్ రాజు.
Published by:Praveen Kumar Vadla
First published: