VENKATESH VARUN TEJ TAMANNAAH MEHREEN F3 MOVIE SHOOTING COMPLETED SR
F3 Movie : షూటింగ్ పూర్తి చేసుకున్న ఎఫ్ 3.. సమ్మర్లో నవ్వుల పండుగ..
Venkatesh Varun Tej F3 Movie Photo : Twitter
F3 Movie : అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. దీనికి కొనసాగింపుగా ఎఫ్ 3 వస్తోంది.
F3 Movie : అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ఆ సినిమాకు ఎఫ్ 3 అంటూ సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్. ఇక అది అలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని చిత్రబృందం ఓ వీడియోను వదిలింది. ఆ వీడియోలో సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న నటులందరూ ఉండడం విశేషం.
ఇక ఈ సినిమా విడుదల విషయానికి వస్తే.. సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించగా... ఆర్ ఆర్ ఆర్ వస్తున్నట్లు ప్రకటించడంతో తమ సినిమాను 2022, ఫిబ్రవరి 25కు మార్చారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ మరోసారి మారింది. ఈ సినిమా విడుదలను ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 28కి మార్చారు. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. వీరితో పాటు హిందీ నటుడు బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్ నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని టాక్.
ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేఅనేది ఈ సినిమా కథ అంటున్నారు. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి.
ఈ యేడాది వెంకటేష్ హీరోగా నటించిన ‘నారప్ప’ ఓటీటీ వేదికగా విడులైన మంచి టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు వెంకటేష్ హీరోగా నటించిన మరో మూవీ ‘దృశ్యం 2’ ఆ మధ్య డైరెక్ట్‌గా హాట్ స్టార్‌లో విడుదలై ఓకే అనిపించుకున్న సంగతి తెలిసిందే. ఇంకోవైపు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ సినిమా కూడా విడుదలకు రెడీగా ఉంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.