F3 Movie | అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ (Venkatesh, Varun Tej) హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 80 కోట్లకు పైగా షేర్.. (రూ. 130 కోట్లకు పైగా గ్రాస్) వసూళ్లను సాధించి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ఆ సినిమాకు ఎఫ్ 3 అంటూ సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ మే 27న విడుదలైన ఎఫ్ 3 పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్‌లోను అదరగొడుతోంది. ఎఫ్ 3 అక్కడ ముఖ్యంగా అమెరికాలో ప్రీమియర్స్‌తో పాటు ఫస్ట్ కలెక్షన్స్ కలిపి 5లక్షల డాలర్స్‌ను వసూలు చేసిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి టీమ్ ఓ పోస్టర్‌ను వదిలింది.
ఇక ఈ సినిమా (F3 Movie) కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాంలో 4.06 కోట్లు, సీడెడ్‌లో 1.26 కోట్లు, ఉత్తరాంధ్ర 1.18 కోట్లు, ఈస్ట్ 76 లక్షలు, వెస్ట్ 94 లక్షలు, గంటూరు 88 లక్షలు, కృష్ణ 66 లక్షలు, నెల్లూరు 61 లక్షలు, ఏపీ తెలంగాణ మొత్తంగా 10.3 కోట్ల షేర్ రాగా.. 17 కోట్ల గ్రాస్ వచ్చింది. కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.85 కోట్లు, ఓవర్సీస్‌లో 2.15 కోట్లు, టోటల్‌గా 13.35 కోట్ల షేర్ రాగా.. 23 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక ఈసినిమా బ 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకోవాలంటే మొదటి రోజు కలెక్షన్స్ కాకుండా ఇంకా 51.15 కోట్ల కలెక్షన్స్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది.
America la modhalaindhi Soggalla Hawa 🤑
A blockbu$ter start at the U$ box office🤩#F3Movie premieres & 1st Day grossed $5️⃣0️⃣0️⃣K+ & Counting🇺🇸
Watch #F3TripleBlockbuster in your nearest cinemas😀@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @SVC_official @PharsFilm @PrimeMediaUS pic.twitter.com/hCuVSMbG9y
— Sri Venkateswara Creations (@SVC_official) May 28, 2022
ఈ సినిమా గురించి తాజా వార్త ఏమిటంటే, F3 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Sony LIV భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాలకు స్ట్రీమింగ్ రానుంది. ఎఫ్ 3 శాటిలైట్ రైట్స్ మాత్రం జీ నెట్‌వర్క్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా చేశారు. సునీల్, అలీ, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, అన్నపూర్ణ, ప్రగతి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో నటించారు. ఎఫ్ 3 చిత్రాన్ని మే 27న విడుదల చేశారు. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటించారు.మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రల్లో మెరిసారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: F3 Movie, Hero venkatesh, Tollywood news, Varun Tej