F3 Movie OTT Partner locked | అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ (Venkatesh, Varun Tej) హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 80 కోట్లకు పైగా షేర్.. ( రూ. 130 కోట్లకు పైగా గ్రాస్) వసూళ్లను సాధించి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ఆ సినిమాకు ఎఫ్ 3 అంటూ సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ మే 27న విడుదలైన ఎఫ్ 3 పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం థియేటర్స్‌లో అలరిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమా గురించి తాజా వార్త ఏమిటంటే, F3 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Sony LIV భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాలకు స్ట్రీమింగ్ రానుంది. అయితే ఇక్కడ మరో విషయం ఏమంటే.. దిల్ రాజు అన్ని సినిమాలు దాదాపుగా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) కొనేది. కానీ ఈసారి మాత్రం ఎఫ్ 3, సోనీ లివ్‌కు వెళ్లింది. దీనికి కారణం ఏమై ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఎఫ్ 3 శాటిలైట్ రైట్స్ మాత్రం జీ నెట్‌వర్క్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా చేశారు. సునీల్, అలీ, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, అన్నపూర్ణ, ప్రగతి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
#F3Movie digital rights bagged by SonyLiv. pic.twitter.com/5qiPDvyJx2
— 📽️ OTT REPORTER 📺 (@Rahul7867861) May 27, 2022
ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో కనిపించారు. ఇక గతేడాది వెంకటేష్ హీరోగా నటించిన ‘నారప్ప’, దృశ్యం 2 సినిమాలు ఓటీటీ వేదికగా విడులైన మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. మరోవైపు వరుణ్ తేజ్ రీసెంట్‌గా ‘గని’మూవీతో పలకరించారు. మరి ఎఫ్ 3 మూవీతో వెంకటేష్, వరుణ్ తేజ్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సత్తా చూపిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: F3 Movie, Hero venkatesh, Tollywood news, Varun Tej