Home /News /movies /

VENKATESH VARUN TEJ F3 2 DAYS WORLD WIDE COLLECTION REPORT HERE SLB

F3 day 2 collections: సమ్మర్ సోగ్గాళ్ళ హవా ఎలా ఉందంటే..?

F3 కలెక్షన్స్ (Twitter/Photo)

F3 కలెక్షన్స్ (Twitter/Photo)

F3 Collections: F2 మూవీ భారీ సక్సెస్ సాధించడంతో అదే జోష్‌లో F3 రూపంలో మరో నవ్వుల రైడ్ ప్రేక్షకుల ముందుంచారు అనిల్ రావిపూడి. మే 27న విడుదలైన ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా మీ ముందుకు తెస్తున్నాం.

దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) మార్క్ చూపిస్తూ వెంకటేష్, వరుణ్ తేజ్ (Venkatesh, Varun Tej) హీరోలుగా వచ్చిన F2 మూవీ భారీ సక్సెస్ సాధించడంతో అదే జోష్‌లో F3 రూపంలో మరో నవ్వుల రైడ్ ప్రేక్షకుల ముందుంచారు. సీక్వెల్ కాదు.. అవే పాత్రలతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన మరో సినిమా ఇది. పూర్తిగా జంధ్యాల, ఇవివి ట్రాక్‌లో తెరకెక్కించిన ఈ మూవీ చూస్తుంటే.. పాత కామెడీ సినిమాలు గుర్తుకు వస్తాయి. గత శుక్రవారం (మే 27) విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. వెంకటేష్, వరుణ్ తేజ్‌ల నటనపై పాజిటివ్ టాక్ వినిపించింది. మరి ఈ రెండు రోజుల్లో F3 కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? సమ్మర్ సోగ్గాళ్ళ హవా ఏ మేర అందిస్తోంది అనేది చూద్దామా..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజుకు గాను 10.35Cr రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకు వచ్చే సరికి 10 శాతం డ్రాప్ అయింది. రెండో రోజుకు గాను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో కలిపి 8.35Cr నెట్ వసూళ్లు రాబట్టారు ఈ సమ్మర్ సోగ్గాళ్లు. గ్రాస్ చూస్తే 13.25Cr వచ్చినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సినిమాకు 39.80Cr గ్రాస్, 23.50Cr నెట్ వసూళ్లు నమోదయ్యాయి.

రెండు రోజుల్లో AP- TG ఏరియా వైజ్ కలెక్షన్స్ చూస్తే..
నైజాం: 8.16 కోట్లు
సీడెడ్: 2.38 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.22 కోట్లు
ఈస్ట్: 1.28 కోట్లు
వెస్ట్: 1.22 కోట్లు
గుంటూరు: 1.42 కోట్లు
కృష్ణా : 1.17 కోట్లు
నెల్లూరు: 85 లక్షలు
AP-TG టోటల్: 18.70CR (20.25CR గ్రాస్)

విడుదలకు ముందు నుంచే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియోస్ మూవీపై భారీ బజ్ క్రియేట్ చేయడంతో ఓవరాల్‌గా బిజినెస్ 63.60Cr ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో 64.50Cr బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బరిలోకి దిగిన ఈ సమ్మర్ సోగ్గాళ్లు మరో 41Cr రాబడితే సక్సెస్ అయినట్టే. ఇకపోతే ఈ F3 సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్‌లోను అదరగొడుతోంది. అక్కడ చూడా చెప్పుకోదగిన నంబర్స్ కనిపిస్తున్నాయి.

ఈ సినిమాలో రే చీకటితో బాధపడే వ్యక్తిగా వెంకటేష్, నత్తితో బాధపడే వ్యక్తిగా వరుణ్ తేజ్ నటించి కడుపుబ్బా నవ్వించారు. వెంకటేష్‌కు జోడీగా తమన్నా నటించగా.. వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ ఆడిపాడింది. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Anil Ravipudi, Daggubati venkatesh, F3 Movie, Varun Tej

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు