కలెక్షన్స్‌లో అదరగొడుతున్న F2..అంతేగా.. అంతేగా..

భార్యాభర్త, ప్రేయసి- ప్రియుడు మధ్య జరిగే చిలిపి, చిన్న చిన్న తగాదాల నేపథ్యంలో అత్యంత వినోదాత్మకంగా తెరకెక్కించిన సినిమా F2. ప్రస్తుతం ఈ సినిమా ఓవర్సీస్‌లో ఇరగదీస్తోంది.

news18-telugu
Updated: January 22, 2019, 10:13 AM IST
కలెక్షన్స్‌లో అదరగొడుతున్న F2..అంతేగా.. అంతేగా..
భార్యాభర్త, ప్రేయసి- ప్రియుడు మధ్య జరిగే చిలిపి, చిన్న చిన్న తగాదాల నేపథ్యంలో అత్యంత వినోదాత్మకంగా తెరకెక్కించిన సినిమా F2. ప్రస్తుతం ఈ సినిమా ఓవర్సీస్‌లో ఇరగదీస్తోంది.
  • Share this:
భార్యాభర్త, ప్రేయసి- ప్రియుడు మధ్య జరిగే చిలిపి, చిన్న చిన్న తగాదాల నేపథ్యంలో వినోదాత్మకంగా తెరకెక్కించిన సినిమా F2. ఈ సినిమాలో వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌లు హీరోలుగా,  హీరోయిన్స్‌గా  తమన్నా, మెహరీన్‌  చేశారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఇరగదీస్తోంది. జనవరి 12న విడుదలైన F2 తొలివారంలోనే రూ.61.43 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసిందని ఓ అంచనా. సుమారు.. రూ.30 కోట్ల నిర్మించిన F2.. అమెరికా బాక్సాఫీసు వద్ద కూడా ఊపేస్తోంది. ఈ సినిమా రెండు మిలియన్‌ డాలర్ల వైపు పరుగులు తీస్తోంది.  దీంతో  దిల్ రాజు ఆనందం రెట్టింపైంది.. ఈ ఆనందంలో ఉన్న..దిల్ రాజు  F2కు సీక్వేల్‌ను కూడా తీస్తానంటున్నాడు.First published: January 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading