#F2: రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్.. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ర‌చ్చ ర‌చ్చ‌..

"ఎఫ్2" సినిమాపై అంచ‌నాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక్కో పోస్ట‌ర్.. సాంగ్.. టీజ‌ర్ విడుద‌ల అవుతుంటే ఆస‌క్తి కూడా పెరిగిపోతుంది. ఇక ఇప్పుడు రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్ అంటూ పాట విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇది చూసిన త‌ర్వాత సినిమాలో సంద‌డి ఏ స్థాయిలో ఉండ‌బోతుందో క‌ళ్ల‌ముందే క‌నిపిస్తుంది. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ఇద్ద‌రూ క‌లిసి ర‌చ్చ చేసారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 19, 2018, 7:18 PM IST
#F2: రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్.. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ర‌చ్చ ర‌చ్చ‌..
‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్
  • Share this:
"ఎఫ్2" సినిమాపై అంచ‌నాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక్కో పోస్ట‌ర్.. సాంగ్.. టీజ‌ర్ విడుద‌ల అవుతుంటే ఆస‌క్తి కూడా పెరిగిపోతుంది. ఇక ఇప్పుడు రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్ అంటూ పాట విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇది చూసిన త‌ర్వాత సినిమాలో సంద‌డి ఏ స్థాయిలో ఉండ‌బోతుందో క‌ళ్ల‌ముందే క‌నిపిస్తుంది. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ఇద్ద‌రూ క‌లిసి ర‌చ్చ చేసారు. వాళ్ల‌కు తోడుగా రాజేంద్ర‌ప్ర‌సాద్ కూడా ఉన్నాడు. ఈ పాట‌కు దేవీ త‌న మార్క్ బీట్ ఇచ్చాడు. చాలా ఏళ్ళ తర్వాత వెంకీ సినిమాకు సంగీతం అందించాడు దేవీ. మరోవైపు అనిల్ రావిపూడి తొలిసారి సాయికార్తిక్‌ను కాదని దేవీ వైపు అడుగులు వేసాడు.


ఇక వెంకీ, వ‌రుణ్ తేజ్ కూడా సింపుల్ డాన్స్ మూవ్స్‌తో ఆక‌ట్టుకున్నారు. రిచ్ లొకేష‌న్స్‌లో అనిల్ రావిపూడి ఈ పాట‌ను అద్భుతంగా చిత్రీక‌రించాడు. ఇక ఈ పాట గురించి ప‌క్క‌న‌బెట్టి సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమా ఒక‌ప్ప‌టి తెలుగు సినిమాను పోలి ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. 1991లో విడుద‌లైన ‘ఇంట్లో పిల్లి వీధిలో పులి’ అనే సినిమా నుంచి ఈ లైన్ అనిల్ రావిపూడి స్పూర్తి పొందాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Venkatesh, Varun Tej F2 Rechipodam Brother Song Released.. "ఎఫ్2" సినిమాపై అంచ‌నాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక్కో పోస్ట‌ర్.. సాంగ్.. టీజ‌ర్ విడుద‌ల అవుతుంటే ఆస‌క్తి కూడా పెరిగిపోతుంది. ఇక ఇప్పుడు రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్ అంటూ పాట విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇది చూసిన త‌ర్వాత సినిమాలో సంద‌డి ఏ స్థాయిలో ఉండ‌బోతుందో క‌ళ్ల‌ముందే క‌నిపిస్తుంది. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ఇద్ద‌రూ క‌లిసి ర‌చ్చ చేసారు. f2 movie,fun and frustration movie,f2 twitter,venkatesh varun tej,F2 Rechipodam Brother Song Released,F2 Rechipodam Brother,Rechipodam Brother song,devi sri prasad f2,telugu cinema,ఎఫ్2 సినిమా,ఎఫ్2 రెచ్చిపోదాం బ్రదర్ సాంగ్,దేవీ శ్రీ ప్రసాద్ రెచ్చిపోదాం బ్రదర్,వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్2,తెలుగు సినిమా,ఎఫ్2 ఆడియో సాంగ్,ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా,తెలుగు మూవీస్
ఇంట్లో పిల్లి వీధిలో పులి, ఎఫ్2 పోస్టర్


ఇందులో నిజం ఎంతుందో తెలియ‌దు కానీ టీజ‌ర్ చూసిన త‌ర్వాత క‌థ మాత్రం ఆ సినిమాను పోలి ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. బ‌య‌ట పులుల్లా ఉండి.. ఇంట్లో మాత్రం భార్య‌ల‌కు భ‌య‌ప‌డే భ‌ర్త‌ల పాత్ర‌ల్లో చంద్ర‌మోహ‌న్, సురేష్ అందులో న‌టించారు. ‘ఎఫ్2’ క‌థ కూడా టీజ‌ర్ చూసిన త‌ర్వాత చూడ్డానికి అలాగే అనిపిస్తుంది. ఇక్క‌డ కూడా సేమ్ టూ సేమ్ భార్య‌ల‌ను కంట్రోల్ చేస్తామ‌ని గొప్ప‌ల‌కు పోయి.. ఇంట్లో మాత్రం వాళ్ల ప‌నుల‌కు త‌ల‌లు బాదుకుంటుంటారు వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్.

Venkatesh, Varun Tej F2 Rechipodam Brother Song Released.. "ఎఫ్2" సినిమాపై అంచ‌నాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక్కో పోస్ట‌ర్.. సాంగ్.. టీజ‌ర్ విడుద‌ల అవుతుంటే ఆస‌క్తి కూడా పెరిగిపోతుంది. ఇక ఇప్పుడు రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్ అంటూ పాట విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇది చూసిన త‌ర్వాత సినిమాలో సంద‌డి ఏ స్థాయిలో ఉండ‌బోతుందో క‌ళ్ల‌ముందే క‌నిపిస్తుంది. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ఇద్ద‌రూ క‌లిసి ర‌చ్చ చేసారు. f2 movie,fun and frustration movie,f2 twitter,venkatesh varun tej,F2 Rechipodam Brother Song Released,F2 Rechipodam Brother,Rechipodam Brother song,devi sri prasad f2,telugu cinema,ఎఫ్2 సినిమా,ఎఫ్2 రెచ్చిపోదాం బ్రదర్ సాంగ్,దేవీ శ్రీ ప్రసాద్ రెచ్చిపోదాం బ్రదర్,వెంకటేష్ వరుణ్ తేజ్ ఎఫ్2,తెలుగు సినిమా,ఎఫ్2 ఆడియో సాంగ్,ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా,తెలుగు మూవీస్
ఎఫ్2 పోస్టర్


విడుద‌ల‌కు ముందు కాపీ కొట్టాడు అనే ప‌దం అన‌డం త‌ప్పే.. సినిమాలో ఏం ఉంటుందో చూడ‌కుండా పోలిక పెట్ట‌డం కూడా అత్యుత్యాహ‌మే అవుతుంది. కానీ కొన్ని సినిమాలు పోలి ఉండ‌టం త‌ప్పేం కాదు. ఎందుకంటే క్రియేటివ్ ఫీల్డ్ లో ఒకే ఐడియా ఇద్ద‌రికి రావ‌చ్చు. అందులో త‌ప్పేం లేదు. ఇప్పుడు ‘ఎఫ్2’ విష‌యంలో అనిల్ రావిపూడి కూడా ఇదే చేసుండొచ్చు. ఇక సినిమా ఎలా ఉండ‌బోతుందో.. ఎంత న‌వ్వించ‌బోతుందో జ‌న‌వ‌రి 12న తెలియ‌నుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.తేజస్వి మదివాడా ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్..


ఇది కూడా చదవండి..

#FlashBack2018: వాళ్ల‌కు ప్ర‌త్యేకం.. స్పెష‌ల్ స్టార్స్ ఆఫ్ 2018..


No 1 Yaari: రానాతో ర‌చ్చ చేసిన వెంక‌టేష్.. నెం 1 యారీ ప్రోమో అదుర్స్..


#FlashBack2018: 2018 స‌ర్‌ప్రైజింగ్ స్టార్స్ ఎవ‌రో తెలుసా..?

Published by: Praveen Kumar Vadla
First published: December 19, 2018, 7:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading