F2:వెంకటేష్,వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్2’ సినిమాకు అరుదైన గౌరవం..

ఈ ఇయర్ సంక్రాంతి కానుకగా  వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది.

news18-telugu
Updated: October 6, 2019, 7:10 PM IST
F2:వెంకటేష్,వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్2’ సినిమాకు అరుదైన గౌరవం..
ఎఫ్2 మూవీ
news18-telugu
Updated: October 6, 2019, 7:10 PM IST
ఈ ఇయర్ సంక్రాంతి కానుకగా  వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్ 2’ మూవీ మంచి సక్సెస్ సాధించింది. తాజాగా  ఈ మూవీ మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. తాజాగా ‘ఎఫ్ 2’ చిత్రం గోవాలో 50వ  ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ యేడాది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ ఇయర్. ఈ సందర్భంగా నవంబర్ 20 నుంచి 28వరకు 76 దేశాలకు చెందిన 250 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.

ఈ లిస్టులో 26 ఫీచర్ ఫిల్మ్స్, 15 నాన్ ఫీచర్ ఫిల్మ్స్  ఉన్నాయి. ఈ 26 సినిమాల్లో తెలుగు నుంచి ‘ఎఫ్ 2’ సినిమా ఎంపిక కావడం విశేషం. ఈ వేడకకు వివిధ దేశాలకు చెందిన పదివేల మంది హాజరవుతారని ప్రభుత్వం భావిస్తుంది.



First published: October 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...