Home /News /movies /

Venkatesh-Varun Tej F3: వెంకటేష్, వరుణ్ తేజ్‌ల F3 షూటింగ్ మొదలు.. సెట్‌లో అడుగుపెట్టిన వెంకీ మామ..

Venkatesh-Varun Tej F3: వెంకటేష్, వరుణ్ తేజ్‌ల F3 షూటింగ్ మొదలు.. సెట్‌లో అడుగుపెట్టిన వెంకీ మామ..

‘ఎఫ్ 3’ షూటింగ్ మొదలు పెట్టిన వెంకీ మామ (Twitter/Photo)

‘ఎఫ్ 3’ షూటింగ్ మొదలు పెట్టిన వెంకీ మామ (Twitter/Photo)

Venkatesh-Varun Tej F3: 2019 సంక్రాంతికి విడుదలైన సంచలన విజయం సాధించిన సినిమా ఎఫ్ 2. వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూట్ ప్రారంభించారు.

    Venkatesh-Varun Tej F3: 2019 సంక్రాంతికి విడుదలైన సంచలన విజయం సాధించిన సినిమా ఎఫ్ 2. అనిల్ రావిపూడిని స్టార్ డైరెక్టర్‌గా మార్చేసింది ఈ చిత్రం. చాలా సంవత్సరాల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక వరుణ్ కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్. ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దిల్ రాజుకు మంచి లాభాలనే తీసుకొచ్చింది. అలాంటి సినిమాకు  సీక్వెల్ చేస్తున్నట్టు ఎపుడో ప్రకటించాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే ఎఫ్‌ 3 కథను కూడా పూర్తి చేసాడు. అంతేకాదు ఈ కథకు వెంకటేష్, వరుణ్ తేజ్ కూడా ఒకే చేసారు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్‌తో పాటు మరో కథానాయకుడికి అవకాశం ఉందట. ఇకవెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను కూడా విడుదల చేసారు.

    ఈ పోస్టర్‌లో వెంకటేష్.. వరుణ్ తేజ్.. ఓ ట్రాలీలో డబ్బులు కట్టలు పట్టుకోని పోతున్నట్టు ఉంది. అంతేకాదు ఎఫ్ 2 కంటే ఎఫ్ 3 ఫన్ మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ సినిమాలో కూడా ఎఫ్ 2 నటించిన తమన్నా, మెహ్రీన్  నటిస్తున్నారు.కథ ప్రకారం ఈ సినిమాలో మరో కథానాయకుడు కూడా అతను ఎవరనేది త్వరలో అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఈ మూడో సీక్వెల్‌లో మూడో హీరో ఉన్న అది కూడా అతిథి పాత్రకే పరిమితం అన్న క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి.


    కరోనా మహామ్మారి లేకపోయి ఉంటే ఈ పాటికే ఈ సినిమా పట్టాలెక్కి ఉండేది. ఇప్పటికే వరుణ్ తేజ్, తమన్నాలపై పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను స్టార్ట్ చేసారు. తాజాగా ఈ రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలి రోజు షూట్‌లో వెంకటేష్ పాల్గొన్నారు. దానికి సంబంధించిన విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించారు.  ప్రస్తుతం వెంకటేష్.. నారప్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రం సమ్మర్‌లో విడుదలలో కానుంది. ఇక ఎఫ్ 3 విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది దసరా కానుకగా విడుదల కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Anil Ravipudi, Dil raju, F3 Movie, Mehreen, Tamannah, Tollywood, Varun Tej, Venkatesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు