Home /News /movies /

VENKATESH TRIPLES REMUNERATION FOR F3 HERE ARE THE DETAILS SR

F3 Movie | Venkatesh : ఎఫ్ 3 కోసం వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. మూడు రెట్లు పెరిగింది..

Venkatesh Photo : Twitter

Venkatesh Photo : Twitter

F3 Movie | Venkatesh : ఈ సినిమాలో వెంకటేష్ రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంకటేష్ ఈ సినిమా కోసం ట్రిపుల్ టైమ్స్ ఎక్కువుగా తీసుకుంటున్నారట. వెంకటేష్ F2 కోసం 5 కోట్లు తీసుకోగా... ఎఫ్3 కోసం రెమ్యునరేషన్ మూడు రెట్లు ఎక్కువుగా తీసుకుంటున్నారట.

ఇంకా చదవండి ...
    F3 Movie | అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో(Venkatesh)  వెంకటేష్, వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది.  చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక మరోవైపు వరుణ్ తేజ్ (Varun Tej) కెరీర్‌లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ఆ సినిమాకు ఎఫ్ 3 అంటూ సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 27న విడుదలకానుంది. అది అలా అంటే.. ఈ సినిమాలో వెంకటేష్ రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంకటేష్ ఈ సినిమా కోసం ట్రిపుల్ టైమ్స్ ఎక్కువుగా తీసుకుంటున్నారట.

    వెంకటేష్ (Venkatesh) F2 కోసం 5 కోట్లు తీసుకోగా... ఎఫ్3 కోసం రెమ్యునరేషన్ మూడు రెట్లు ఎక్కువుగా తీసుకుంటున్నారట. అంటే వెంకటేష్ F3 కోసం 15 కోట్లు తీసుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగిందని.. అందుకే వెంకటేష్ ఈ రేంజ్‌లో తీసుకుంటున్నారని అంటున్నారు.

    F3 censor completed, F3,F 3 Movie Lyrical Song Released,F3 Movie Trailer Talk,F3 Trailer Talk, Venkatesh Varun Tej F3 Movie,F3 Movie F3,F3 movie,F3 Movie Second Single,F3 Movie first single, F3 Movie shooting completed, F3 Release date, F3 teaser ,F3 Movie,F3 Movie Shoot Resumes,F3 Movie Shooting Re Start,f3 movie,f3 movie story,f3 movie story leaks,venkatesh varun tej f3 movie,f3 movie social media,telugu cinema,anil ravipudi f3 storyline,ఎఫ్ 3 మూవీ విడుదల తేదీ,ఎఫ్ 3 స్టోరీ లీక్,అనిల్ రావిపూడి ఎఫ్ 3 స్టోరీ,వెంకటేష్,వరుణ్ తేజ్,ఎఫ్ 3 మూవీ ట్రైలర్,ఎఫ్ 3 మూవీ,ఎఫ్ 3 మూవీ
    F3 Censor Photo : Twitter


    ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా యూ సర్టిఫికేట్ పొందింది. దీంతో దీనికి సంబంధించిన మరో పోస్టర్‌ను విడుదల చేసింది ఎఫ్ 3 టీమ్. ఇప్పటికే  ఈ చిత్రం నుంచి రెండు పాటలు విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘లైఫ్ అంటే ఇట్లా ఉండాలా’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేసారు. ఈ సాంగ్‌లో వెంకటేష్‌, వరుణ్ తేజ్‌తో పూజా హెగ్డే ఆడిపాడింది. ఈ సాంగ్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనుంది. ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు.  ఎఫ్ 3 చిత్రాన్ని మే 27న  విడుదల చేస్తున్నారు.


    ఈ సినిమాలో (Venkatesh) వెంకటేష్‌కు జోడీగా (Tamannah) తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. వీరితో పాటు హిందీ నటుడు బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్ నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని టాక్.తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసారట. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు.

    ఎఫ్ 3 Photo : Twitter
    ఎఫ్ 3 Photo : Twitter


    అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేఅనేది ఈ సినిమా కథ అంటున్నారు. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. గతేడాది వెంకటేష్ హీరోగా నటించిన ‘నారప్ప’, దృశ్యం 2 ఈ సినిమాలు ఓటీటీ వేదికగా విడులైన మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. మరోవైపు వరుణ్ తేజ్ రీసెంట్‌గా ‘గని’మూవీతో పలకరించారు. మరి ఎఫ్ 3 మూవీతో వెంకటేష్, వరుణ్ తేజ్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సత్తా చూపిస్తారో చూడాలి.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Tollywood news, Venkatesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు