‘ఢీ’ షో జడ్జ్‌కు ప్రమోషన్.. వెంకటేష్ సరసన హీరోయిన్ ఛాన్స్..

గతేడాది మొదట్లో ‘ఎఫ్ 2’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీతో బోణి చేసిన వెంకటేష్.. ఇయర్ ఎండింగ్‌లో మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమాతో సక్సెస్‌తో మంచి ముగింపు పలికాడు. ఈ యేడాది మాత్రం.. తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన సూపర్ హిట్ ‘అసురన్’ రీమేక్‌ను పట్టాలెక్కించేపనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన జాతీయ ఉత్తమ నటిని ఎంపిక చేసారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 2, 2020, 12:39 PM IST
‘ఢీ’ షో జడ్జ్‌కు ప్రమోషన్.. వెంకటేష్ సరసన హీరోయిన్ ఛాన్స్..
వెంకటేష్,సరసన ఢీ షో జడ్జ్ (Twitter/Photo)
  • Share this:
గతేడాది మొదట్లో ‘ఎఫ్ 2’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీతో బోణి చేసిన వెంకటేష్.. ఇయర్ ఎండింగ్‌లో మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమాతో సక్సెస్‌తో మంచి ముగింపు పలికాడు. ఈ యేడాది మాత్రం.. తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన సూపర్ హిట్ ‘అసురన్’ రీమేక్‌ను పట్టాలెక్కించేపనిలో ఉన్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కలైపులి ఎస్.థానుతో కలిసి సురేష్ బాబు ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టి సెట్స్ పైకి తీసుకెళ్లడమే తరువాయి. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ సరసన జాతీయ ఉత్తమ నటి ప్రియమణి దాదాపు ఖరారైంది.ఈమె ఈటీవీలో ప్రసారమయ్యే రియాలిటీ షో ‘ఢీ’కు జడ్జ్‌గా వ్యవహరించింది. అంతేకాదు ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్‌లో నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

venkatesh to romance with national award winning heroin priyamani in asuran telugu remake,Venkatesh,Venkatesh asuran,asuran movie collections,priyamani,priyamani venkatesh,priyamani venkatesh asuran telugu remake,asuran movie review,dhanush asuran movie,dhanush asuran movie review,asuran telugu remake,asuran remake,venkatesh asuran movie,telugu cinema,వెంకటేష్,వెంకటేష్ అసురన్,అసురన్ రీమేక్,అసురన్ తెలుగు రీమేక్,తెలుగు సినిమా,ప్రియమణి,అసురన్,వెంకటేష్ ప్రియమణి,వెంకటేష్ ప్రియమణి అసురన్ రీమేక్
వెంకటేష్,ప్రియమణి (Twitter/Photo)


తమిళంలో ధనుశ్ డబుల్ రోల్లో యాక్ట్ చేసాడు. తెలుగులో మాత్రం వెంకటేష్‌తో పాటు రానాను తీసుకునే ఛాన్స్ ఉంది. ‘అసురున్’ చిత్ర విషయానికొస్తే.. కుల వ్యవస్థ దాని మూలంగా జరిగిన గొడవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ నేటివిటీకి ఈ కథ సరిపోయింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో హీరో.. ఊర్లో వాళ్ల కాళ్లు మొక్కడం.. ఆవు పేడ వేస్తే ధనుశ్ చేత్తో ఎత్తడం వంటి రియలిస్టిక్ సన్నివేశాలున్నాయి. తమిళ హీరోలు.. ప్రేక్షకులను అభిమానులను కాకుండా.. కథకున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆయా సన్నివేశాల్లో నటించారు. మరి తెలుగు ప్రేక్షకులు ఇటువంటి కథ, కథనం ఉన్న చిత్రాన్ని వెంకటేష్ ఏ మేరకు చేస్తాడనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 2, 2020, 12:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading