ఎన్టీఆర్,ప్రభాస్‌లతో మల్టీస్టారర్ సినిమాలు చేయాలనుంది.. వెంకటేష్..

ఒక్క హిట్ కొట్ట‌గానే విక్ట‌రీ అందుకున్నాం అని సంబ‌ర‌ప‌డిపోయే వాళ్లు ఉంటారు. కానీ ఆయ‌న‌కు మాత్రం విక్ట‌రీ ఎప్పుడూ ప‌క్క‌నే ఉంటుంది. ఇక వెంకటేష్‌కు..

news18-telugu
Updated: December 13, 2019, 7:45 AM IST
ఎన్టీఆర్,ప్రభాస్‌లతో మల్టీస్టారర్ సినిమాలు చేయాలనుంది.. వెంకటేష్..
వెంకటేష్,జూనియర్ ఎన్టీఆర్,ప్రభాస్ (Facebook/Photos)
  • Share this:
ఒక్క హిట్ కొట్ట‌గానే విక్ట‌రీ అందుకున్నాం అని సంబ‌ర‌ప‌డిపోయే వాళ్లు ఉంటారు. కానీ ఆయ‌న‌కు మాత్రం విక్ట‌రీ ఎప్పుడూ ప‌క్క‌నే ఉంటుంది. పిలిచినప్పుడు వ‌స్తుంటుంది.. విక్ట‌రీ ఇంటిపేరుగా మార్చుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు. కానీ ఆయ‌న అదే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ద‌గ్గుపాటి నుంచి విక్ట‌రీ అయిపోయాడు. 33 ఏళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీలో తిరుగులేని ప్ర‌యాణం సాగిస్తున్న సంచ‌ల‌న హీరో వెంక‌టేష్. ఈ రోజు వెంకీ మామ బర్త్ డే.  అంతేకాదు వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘వెంకీ మామ’ సినిమా మొదటి సారి ఆయన పుట్టినరోజున విడుదలవుతోంది. తెలుగులో ప్రస్తుతం వెంకటేష్.. మల్టీస్టారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. సినిమాల్లోకి అనుకోకుండా వచ్చాను. అంతేకాదు హార్డ్ వర్క్‌ను నమ్ముకున్నాను. నాలో ఇంకా విషయం ఉందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే నేను సినిమాల్లో కొనసాగుతున్నానన్నారు.

venkatesh,venkatesh birthday,venky mama,venky mama twitter,venky mama release date,venky mama release date on december 13,venky mama look,venky mama vinayaka chavithi poster,venkatesh naga chaitanya,naga chaitanya twitter,venky mama twitter,venky mama movie release date,telugu cinema,venky mama,venkatesh naga chaitanya movie,naga chaitanya,venky mama teaser,venky mama first look,venky mama trailer,venky mama movie,venky mama songs,venky mama first look teaser,venky mama movie teaser,venky mama release date,venky mama movie release date,venky mama movie updates,naga chaitanya movies,venky mama movie trailer,venky mama telugu movie,venky mama making,venkatesh,వెంకటేష్,నాగచైతన్య,వెంకీ మామా వినాయక చవితి పోస్టర్,తెలుగు సినిమా,వెంకీ మామ రిలీజ్ డేట్ ఫిక్స్
‘వెంకీ మామ’ పోస్టర్ (Twitter/Photo)


ఐదేళ్ల నుండి సినిమాలకు గుడ్ బై చెప్పేద్దామనుకున్నా.. కావడం లేదు. ఒకప్పుడు వివేకానంద రోల్ చేయాలని ఉండేది. కానీ అలాంటి కథలు రావడం లేదు. ప్రస్తుతం తెలుగులో మిగతా హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తున్నాను. నా ఏజ్ గ్రూప్ హీరోలతో కాకుండా.. యంగ్ హీరోలతో చేస్తున్నాను. ఇప్పటికే కమల్ హాసన్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాగ చైతన్య, వరుణ్ తేజ్, రామ్‌‌ లతో మల్టీస్టారర్ సినిమాలు చేసాను. ఒకవేళ చేయాల్సి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌లతో మల్టీస్టారర్ చేయాలని ఉంది. నానితో ఇదివరకు ఒక స్టోరీ అనుకున్నా.. వర్కౌట్ కాలేదు. భవిష్యత్తులో చేస్తానేమో చెప్పలేనన్నారు. 

 

First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>