23 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న వెంకటేష్ ‘ప్రేమించుకుందాం.. రా’..

Venkatesh Preminchukundam Raa Mpovie | వెంకటేష్ కెరీర్‌లోనే సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ప్రేమించుకుందాం.. రా సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. జయంత్. సి. పరాన్జీ ఈ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రం మే 9తో 23 ఏళ్లు కంప్లీట్ చేసుకుంటోంది.

news18-telugu
Updated: May 8, 2020, 8:06 PM IST
23 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న వెంకటేష్ ‘ప్రేమించుకుందాం.. రా’..
23 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న ప్రేమించుకుందాం.. రా సినిమా (Twitter/Photo)
  • Share this:
వెంకటేష్ కెరీర్‌లోనే సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ప్రేమించుకుందాం.. రా సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. జయంత్. సి. పరాన్జీ ఈ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. అంతేకాదు ఈ సినిమాతో అంజలా ఝవేరి హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మించారు. డి.రామానాయుడు సమర్పకుడిగా వ్యవహరించారు. తాజాగా ప్రేమించుకుందాం.. రా సినిమా మే 9తో 23 ఏళ్లు కంప్లీట్ చేసుకుంటోంది. ప్రేమించుకుందాం..రా సినిమా స్టోరీ విషయానికొస్తే.. మాములు ప్రేమకథకు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కించి ఈ చిత్రాన్ని సూపర్ హిట్‌ చేసాడు దర్శకుడు జయంత్. సి.పరాన్జీ. అంతేకాదు మాములు మధ్యతరగతి కుర్రాడు.. రాయలసీమలోని ఓ ఫ్యాక్షన్ కూతురిని ప్రేమిస్తాడు. ఈ సందర్భంగా ఈ ఫ్యాక్షనిస్ట్ వాళ్ల కుటుంబాన్ని ఏ విధంగా హింసల పాలు చేసేడు.చివరకు హీరో తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనేదే  ఈ సినిమా స్టోరీ. మొత్తంగా చూసుకుంటే.. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో తెలుగులో తెరకెక్కిన తొలి చిత్రంగా ‘ప్రేమించుకుందాం రా’ సినిమా రికార్డులకు ఎక్కింది.

venkatesh super hit preminchukundam raa movie completed 23 years,venkatesh,preminchukundam raa,venkatesh movies,venkatesh preminchukundam raa,venkatesh twitter,venkatesh instagram,venkatesh facebook,suresh babu,d rama naidu, super hit preminchukundam raa movie,venkatesh super hit preminchukundam raa movie completed 23 years,tollywood,telugu cinema,వెంకటేష్,ప్రేమించుకుందాం రా.23 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న ప్రేమించుకుందాం రా, ప్రేమించుకుందాం రా, 23 ఏళ్ల ప్రేమించుకుందాం రా, వెంకటేష్ సినిమాలు,
23 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న ప్రేమించుకుందాం.. రా సినిమా (Twitter/Photo)

ఆ తర్వాత మోహన్ బాబు ..శ్రీరాములయ్య’ సినిమా కూడా ఫ్యాక్షన్ స్టోరీ. కానీ ఇది పరిటాల రవి తండ్రి శ్రీరాములయ్య జీవిత కథకు కొంచెం కాల్పనిక కథ జోడించి తెరకెక్కించారు. ఆ తర్వాత బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సమర సింహారెడ్డి’ సినిమా అసలు సిసలు ఫ్యాక్షన్ సినిమా అనే చెప్పాలి. అందులో హీరో, విలన్ ఇద్దరు ఫ్యాక్షన్ లీడర్లు కావడం గమనార్హం.

venkatesh super hit preminchukundam raa movie completed 23 years,venkatesh,preminchukundam raa,venkatesh movies,venkatesh preminchukundam raa,venkatesh twitter,venkatesh instagram,venkatesh facebook,suresh babu,d rama naidu, super hit preminchukundam raa movie,venkatesh super hit preminchukundam raa movie completed 23 years,tollywood,telugu cinema,వెంకటేష్,ప్రేమించుకుందాం రా.23 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న ప్రేమించుకుందాం రా, ప్రేమించుకుందాం రా, 23 ఏళ్ల ప్రేమించుకుందాం రా, వెంకటేష్ సినిమాలు,
23 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న ప్రేమించుకుందాం.. రా సినిమా (Twitter/Photo)

ఇక ప్రేమించుకుందాం రా సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా అప్పటి వరకు వచ్చిన ప్రేమకథల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా హీరో వెంకటేష్, అంజలా ఝవేరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసాయి. ఇక ఈ చిత్రానికి మహేష్ అందించిన సంగీతం, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచాయి. మొత్తంగా ప్రేమకథ చిత్రాల్లో ప్రేమించుకుందాం రా  ఓ ట్రెండ్ సెట్టర్ మూవీ అనే చెప్పాలి.
First published: May 8, 2020, 8:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading