నాగార్జునను చూసి భయపడుతున్న వెంకటేష్.. ఆ రీమేక్‌కు నో..

అన్నిసార్లు స్వీయ అనుభవాలే అవసరం లేదు.. కొన్నిసార్లు పక్కవాళ్లకు జరిగింది చూసి కూడా మనకు జ్ఞానోదయం కలుగుతుంది. ఇప్పుడు వెంకటేష్ విషయంలో ఇదే జరుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 10, 2019, 2:35 PM IST
నాగార్జునను చూసి భయపడుతున్న వెంకటేష్.. ఆ రీమేక్‌కు నో..
వెంకటేష్ నాగార్జున (Source: Twitter)
  • Share this:
అన్నిసార్లు స్వీయ అనుభవాలే అవసరం లేదు.. కొన్నిసార్లు పక్కవాళ్లకు జరిగింది చూసి కూడా మనకు జ్ఞానోదయం కలుగుతుంది. ఇప్పుడు వెంకటేష్ విషయంలో ఇదే జరుగుతుంది. నాగార్జున చేసిన ఒక్క సినిమా ఈయన కళ్లు తెరిపించింది. మన్మథుడు 2 తర్వాత నాగార్జునకు విమర్శలు కూడా వచ్చాయి. ట్రెండీగా ఉంటుంది.. ఇప్పటి ప్రేక్షకుల కోసం ఈ సినిమా చేసానని నాగ్ ఎంత చెప్పినా కూడా వాళ్లు మాత్రం అర్థం చేసుకోలేదు. సరికదా.. పై నుంచి విమర్శించారు కూడా. 60 ఏళ్ల వయసులో ఇలాంటి సినిమాలు ఎవరికోసం చేస్తున్నాడు అనేది ఆయనపై వచ్చిన ప్రధాన విమర్శ.

Venkatesh says no to DeDe Pyar De telugu remake after watching Nagarjuna Manmadhudu 2 disaster pk అన్నిసార్లు స్వీయ అనుభవాలే అవసరం లేదు.. కొన్నిసార్లు పక్కవాళ్లకు జరిగింది చూసి కూడా మనకు జ్ఞానోదయం కలుగుతుంది. ఇప్పుడు వెంకటేష్ విషయంలో ఇదే జరుగుతుంది. venkatesh,nagarjuna,venkatesh nagarjuna,vankatesh dede pyar de remake,venkatesh twitter,nagarjuna twitter,venkatesh venky mama movie,venkatesh naga chaitanya,telugu cinema,వెంకటేష్,నాగార్జున,వెంకటేష్ నాగార్జున,మన్మథుడు 2,తెలుగు సినిమా
మన్మథుడు 2లో రకుల్,నాగార్జున (ఫైల్ ఫోటో)

సాక్షాత్తు ఈ చిత్రం అక్కినేని కోడలు సమంతకు కూడా నచ్చలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మన్మథుడు 2 ఫ్లాప్ అయిన విధానం చూసి ఇప్పుడు వెంకటేష్ కూడా ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఈయన దేదే ప్యార్ దే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో ఈ చిత్ర కథ కూడా ఫైనల్ అయిపోయింది. స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తున్నాడు. వెంకీ మామ తర్వాత ఈ చిత్రం మొదలు పెట్టాలనుకుంటున్న తరుణంలో మన్మథుడు 2 రావడం.. ఫ్లాప్ కావడంతో వెంకీ ఇప్పుడు ఈ అభిప్రాయాన్ని మార్చుకున్నాడని తెలుస్తుంది.

Venkatesh says no to DeDe Pyar De telugu remake after watching Nagarjuna Manmadhudu 2 disaster pk అన్నిసార్లు స్వీయ అనుభవాలే అవసరం లేదు.. కొన్నిసార్లు పక్కవాళ్లకు జరిగింది చూసి కూడా మనకు జ్ఞానోదయం కలుగుతుంది. ఇప్పుడు వెంకటేష్ విషయంలో ఇదే జరుగుతుంది. venkatesh,nagarjuna,venkatesh nagarjuna,vankatesh dede pyar de remake,venkatesh twitter,nagarjuna twitter,venkatesh venky mama movie,venkatesh naga chaitanya,telugu cinema,వెంకటేష్,నాగార్జున,వెంకటేష్ నాగార్జున,మన్మథుడు 2,తెలుగు సినిమా
వెంకటేష్ రకుల్ ప్రీత్ సింగ్ (Source: Twitter)

దేదే ప్యార్ దేలో కూతురు వయసు కంటే తక్కువ ఉన్న అమ్మాయితో హీరో ప్రేమలో పడతాడు.. మాజీ భార్యతో విడిపోయిన తర్వాత 50 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ళ అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. అలాంటి కథను ఇప్పుడు తెలుగులో చేస్తే తనకు కూడా నాగార్జునకు వచ్చినట్లే విమర్శలు వస్తాయని భయపడుతున్నాడు వెంకటేష్. అందుకే ఈ చిత్ర రీమేక్ ప్రస్తుతానికి ఆపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే నాగచైతన్యతో కలిసి వెంకీ మామ సినిమాలో నటిస్తున్నాడు వెంకటేష్. మొత్తానికి మన్మథుడు 2 సినిమా చూసి వెంకీ కూడా వెనకడుగు వేసాడన్నమాట.
First published: September 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading