హోమ్ /వార్తలు /సినిమా /

Venkatesh | Saindhav : ఈరోజు నుంచే వెంకటేష్ సైంధవ్ చిత్రీకరణ షురూ..

Venkatesh | Saindhav : ఈరోజు నుంచే వెంకటేష్ సైంధవ్ చిత్రీకరణ షురూ..

Venkatesh Saindhav Photo : Twitter

Venkatesh Saindhav Photo : Twitter

Venkatesh | Saindhav : హీరో వెంకటేష్ ఆ మధ్య ఎఫ్3తో వచ్చి తన కామెడీతో అలరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వెంకీ, రానాతో కలిసి రానా నాయుడు అనే ఓ వెబ్ సిరీస్‌‌ చేశారు. ఇక తాజాగా వెంకీ, హిట్ సిరీస్ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శైలేష్ కొలనుతో ఓ సినిమాను చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

విక్టరీ వెంకటేష్ (Venkatesh ) ఆ మధ్య ఎఫ్3లో  తన కామెడీతో అలరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వెంకీ, రానాతో కలిసి రానా నాయుడు (Rana Naidu) అనే ఓ వెబ్ సిరీస్‌‌ చేశారు. ఇటీవల స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం మంచి ఆదరణ పొందుతోంది. ఇక అది అలా ఉంటే వెంకీ తన 75వ సినిమాను యువ దర్శకుడు శైలేష్ కొలను(Sailesh Kolanu)తో చేస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాకు సైంధవ్ (Saindhav) అనే పేరును ఖరారు చేశారు.  మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈచిత్రం ఈరోజు నుంచి షూటింగ్‌ను షురూ చేయనుంది. దీనికి సంబంధించి చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇక గ్లింప్స్ అంటూ  సినిమా ప్రకటన సమయంల విడుదల చేసిన ఓ చిన్న వీడియో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. హిట్ (Hit) సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు బాగానే హిట్ అయ్యాయి. ఈ సినిమాలో కీలకపాత్రలో హిందీ నటుడు నవాజ్జుద్దీన్ సిద్ధిఖీ  నటుస్తున్నారు.

ఈ సినిమాను నాని‌తో శ్యామ్ సింగ రాయ్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, విజయాన్ని అందుకున్న వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మితమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలకానుంది.

ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే.. వెంకటేష్ ఇటీవల యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఓరి దేవుడాలో ఓ కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఇక వెంకీ అంతకు ముందు ఎఫ్ 3 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ఎఫ్2కు సీక్వెల్‌గా వచ్చింది. అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు ముందు వెంకీ నారప్ప, దృశ్యం2 వంటి సినిమాలతో ముందుకొచ్చారు. అయితే ఈ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందాయి.

ఇక వెంకటేష్ నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ విషయానికి వస్తే.. ఈ వెబ్ సిరీస్‌ హిందీతో పాటు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో  వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. గతంలో వీళ్లిద్దరు  ‘కృష్ణం వందే జగద్గురుమ్’  సినిమాలో ఓ పాటలో దగ్గుబాటి బాబాయి అబ్బాయి కలిసి నటించారు. కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు. ఇపుడు ఆ కోరిక ఈ వెబ్ సిరీస్‌తో నెరవేరింది.  మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసారు. థ్రిల్లర్ ఎలిమెంట్‌తో వెంకటేష్, రానా నెట్‌ప్లిక్స్‌లో సందడి చేస్తోంది.

ఇక దర్శకుడు శైలేష్ కొలను విషయానికి వస్తే.. మంచి అంచనాల నడుమ వచ్చిన హిట్ 2 సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో  అదరగొట్టింది.. థియేట్రికల్ రన్ పూర్తి అవ్వడంతో ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. హిట్ యూనివర్స్ మూడో సినిమా హిట్3 త్వరలో రానుంది. ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తున్నారు. త్వరలో షూటింగ్‌కు వెళ్లనుంది. ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పాత్రలో కనిపించనున్నారు.

First published:

Tags: Hero venkatesh, Tollywood news

ఉత్తమ కథలు