Sridevi Soda Center Trailer : సుధీర్ బాబు (Sudheer Babu), ఆనంది (Anandhi) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్ . ఈ సినిమాను పలాస 1978 ఫేమ్ కరుణ్ కుమార్ డైరెక్ట్ చేసారు. 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే మహేష్ బాబు చేతుల మీదుగా ఓ ట్రైలర్ విడులైంది. అంతేకాదు ప్రభాస్ కూడా ఈ సినిమాకు తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా వెంకటేష్ చేతులు మీదుగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ (Sridevi Soda Centre) సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ సినిమాలో సుధీర్ బాబు.. సూరిబాబు పాత్రలో ఊర మాస్ పాత్రలో అదరగొట్టారు. ఈ ట్రైలర్‌లో సుధీర్ బాబు ఓ మర్డర్ కేసులో సెంట్రల్ జైలు అడుగుపెట్టే సీన్‌తో మొదలైంది. ఈ సందర్భంగా జైలుకు వచ్చిన మనిషి. జైలు నుంచి బయటకు వచ్చిన మనిషి ఎప్పటికీ ఎపుడు ఒకటి కాలేరంటూ వచ్చిన డైలాగ్ ఆలోచింప చేసే విధంగా ఉంది. ఓ ఊరిలో సోడాలు అమ్ముకునే శ్రీదేవిని సుధీర్ బాబు ప్రేమిస్తాడు. వీళ్లిద్దరి పెళ్లికి కులం అడ్డు వస్తోంది.
ఈ సందర్భంగా హీరోయిన్ కు సంబంధించిన వాళ్లు సుధీర్ బాబును అడుగుగడున అడ్డు తగులుతారు. చివరకి హీరో తాను ప్రేమించిన శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడా లేదా అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో సుధీర్ బాబు ఊరమాస్‌గా అదరగొట్టారు. సిక్స్ ప్యాక్ బాడీ చూసిస్తూ .. సుధీర్ బాబు చేసిన ఫైట్స్ మాస్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో సుధీర్ బాబు చెప్పిన డైలాగులు ఎమోషన్స్.. ‘వీ’ సినిమాలో నానిని గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి.
Sridevi Soda Center trailer is very impressive. Good luck to the team for the grand release tomorrow. Experience the magic on the big screen.https://t.co/Alhci0yzH1#SrideviSodaCenter #SrideviSodaCenterOn27thAug @isudheerbabu @anandhiactress @70mmEntertains @Karunafilmmaker
— Venkatesh Daggubati (@VenkyMama) August 26, 2021
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా అన్నీ సమపాళ్లలో కలిసిన శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ అందుకుంటుంది. ఇప్పటికే సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ ఇచ్చారు దాంతో పాటు డైలాగులు కూడా అక్కడక్కడా కాస్త శృతి మించినట్లు అనిపిస్తున్నాయి. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇండియా వ్యాప్తంగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు చాలా మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియెట్రికల్ రైట్స్ ఫాన్సీ ప్రైస్ కు అమ్ముడయ్యాయి. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ శ్రీదేవి సోడా సెంటర్ హక్కులను సొంతం చేసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు లక్ష్మణ్.
ఖైదీ టూ ఇంద్ర వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన చిరంజీవి సినిమాలు ఇవే..
ఇండియాలోనే కాదు ఓవర్సీస్‌లోనూ భారీగా విడుదలవుతుంది శ్రీదేవి సోడా సెంటర్. ఇప్పటికే అక్కడ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. వీటికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. జాతి రత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లక్ష్మణ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా ఇది. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anandhi, Sridevi Soda Center, Sudheer Babu, Tollywood