హోమ్ /వార్తలు /సినిమా /

Venkatesh -Rana Naidu Teaser Talk: అదిరిన వెంకీ, రానాల రానా నాయుడు టీజర్.. బాబాయికి అబ్బాయి దమ్కీ..

Venkatesh -Rana Naidu Teaser Talk: అదిరిన వెంకీ, రానాల రానా నాయుడు టీజర్.. బాబాయికి అబ్బాయి దమ్కీ..

వెంకటేష్,రానాల ‘రానా నాయుడు’ టీజర్ విడుదల (Twitter/Photo)

వెంకటేష్,రానాల ‘రానా నాయుడు’ టీజర్ విడుదల (Twitter/Photo)

Venkatesh -Rana Naidu Teaser Talk: గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్...ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈయన తన అబ్బాయి రానాతో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేసారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Venkatesh -Rana Naidu Teaser Talk: గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్...ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్‌తో చేసిన ఎఫ్ 3 మూవీతో మరో సక్సెస్ అందుకున్న ఈయన రానాతో చేస్తోన్న రానా నాయుడు అనే వెబ్ సిరీస్ కంప్లీట్ చేశారు. తాజాగా మరో ఒకటి రెండు మల్టీస్టారర్స్‌కు ఓకే చెప్పారు. ‘రానా నాయుడు’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌ హిందీతో పాటు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో  వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు.గతంలో వీళ్లిద్దరు  ‘కృష్ణం వందే జగద్గురుం’  సినిమాలో ఓ పాటలో దగ్గుబాటి బాబాయి అబ్బాయి కలిసి నటించారు. కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు.

ఇపుడు ఆ కోరిక ఈ వెబ్ సిరీస్‌తో నెరవేరబోతుంది.  మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసారు. తాజాగా ఈ టీజర్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.

ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్‌తో కూడి ఉంది. తాజాగా విడుడల చేసిన టీజర్‌లో రానా గ్యాంగ్ స్టర్ పాత్రలో అదరగొట్టారు. ఇక వెంకటేష్ కూడా గుబురు గడ్డంతో తన ఏజ్‌కు తగ్గ పాత్రలో సాల్డ్ అండ్ పెప్పర్ లుక్‌లో కేక పుట్టిస్తున్నాడు. వెంకీ కొత్త మేకోవర్‌లో కొత్తగా కనిపిస్తున్నారు.  మొత్తంగా ఒకే స్క్రీన్ పై బాబాయి, అబ్బాయిలను చూడాలనుకున్న అభిమానులకు ఈ వెబ్  సిరీస్ పండగే అని చెప్పాలి. మొత్తంగా థ్రిల్లర్ ఎలిమెంట్‌తో వెంకటేష్, రానా నెట్‌ప్లిక్స్‌లో సందడి చేయనున్నారు. ఇక తెలుగులో ఈ టీజర్ విడుదల చేస్తే ఆ రేంజ్ వేరే లెవల్లో ఉండే అవకాశం ఉంది. నెటిజన్స్ కూడా తెలుగులో కూడా ఈ టీజర్ విడుదల చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక వెంకటేష్ .. ఈ యేడాది ‘ఎఫ్ 3’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్.. సల్మాన్‌ ఖాన్‌తో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా చేస్తున్నారు. అటు విశ్వక్‌సేన్‌తో కలిసి ‘ఓరి దేవుడా’ సినిమా చేస్తున్నారు.

మరోవైపు రానా కూడా వరుస సినిమాలతో దుమ్ము దులుపుతున్నాడు. ఈ యేడాది పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’  సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ‘విరాట పర్వం’ సినిమాతో పలకరించారు.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Netflix, Rana daggubati, Rana Naidu Web Series, Tollywood, Venkatesh

ఉత్తమ కథలు