హోమ్ /వార్తలు /సినిమా /

Venkatesh -Rana Naidu: వెంకటేష్, రానాల ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ట్రైలర్ టాక్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

Venkatesh -Rana Naidu: వెంకటేష్, రానాల ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ట్రైలర్ టాక్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

వెంకటేష్, రానాల ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ (Twitter/Photo)

వెంకటేష్, రానాల ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ (Twitter/Photo)

Venkatesh -Rana - Rana Naidu Trailer and Streaming Date Fix: : గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్...ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈయన రానాతో కలిసి ‘రానా నాయుడు వెబ్ సిరీస్ చేస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌తో పాటు స్ట్రీమింగ్ ఎపుడనేది అధికారికంగా ప్రకటించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Venkatesh -Rana - Rana Naidu Trailer and Streaming Date Fix: గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్...ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నారు. గతేడాది వరుణ్ తేజ్‌తో చేసిన ‘ఎఫ్ 3’ మూవీతో మరో సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత విశ్వక్‌ సేన్‌తో ‘ఓరి దేవుడా’ మూవీలో దేవుడి పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈయన అబ్బాయి   రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ కంప్లీట్ చేశారు.  ‘రానా నాయుడు’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌ హిందీతో పాటు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో  వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు.గతంలో వీళ్లిద్దరు  ‘కృష్ణం వందే జగద్గురుం’  సినిమాలో ఓ పాటలో దగ్గుబాటి బాబాయి అబ్బాయి కలిసి నటించారు. కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు.

ఇపుడు ఆ కోరిక ఈ వెబ్ సిరీస్‌తో నెరవేరబోతుంది. నిజ జీవితంలో బాబాయి, అబ్బాయిలైన వెంకటేష్, రానాలు ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా నటించారు. రానా ఇది వరకు కనిపించని ఫెరోషియస్ పాత్రలో కనిపించారు. ఇక నాగ పాత్రలో వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ ‌లుక్‌లో కేక పుట్టిస్తున్నాడు.  తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేసారు. తండ్రి అంటే పడని కొడుకు పాత్రలో రానా నటించారు. ఓవరాల్‌గా చెప్పాలంటే ఉప్పు, నిప్పు తరహాలో వీళ్లిద్దరు పాత్రలున్నాయి. ఈ వెబ్ సిరీస్ మార్చి 10న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. వెంకటేష్, రానాలకు ఇదే ఫస్ట్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ అమెరికన్ సిరీస్ రే డోనోవన్‌కు భారతీయ అడాప్షన్.

రానా దగ్గుబాటి తన బాబాయ్, నెట్‌ఫ్లిక్స్‌తో మొదటిసారి కలిసి పని చేయడం గురించి మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్ట్ చాలా కారణాల వల్ల ప్రత్యేకమైనది. ఇది నెట్‌ఫ్లిక్స్‌తో బాబాయ్ వెంకీతో నా మొదటి కొలాబరేషన్ . ఈ ప్రాజెక్ట్‌లో సుందర్ (ఆరోన్,) కరణ్ (అన్షుమాన్) సుపర్ణ్ (వర్మ)తో కలిసి పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. రానా నాయుడు దానిని అందించినందుకు సంతోషిస్తున్నాను. మొత్తం తారాగణం, టీం ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డారు. ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. రానా నాయుడు పాత్రను పోషించడం ఒక సవాలుగా అనిపించింది. అతను తన కుటుంబంతో లోతైన భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉన్న సంక్లిష్టమైన పాత్ర, అదే సమయంలో తన తండ్రితో అతని సంబంధంతో కూడా పోరాడే పాత్ర. రానా, నాగ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రపంచాన్ని అందరూ ఎక్స్ పీరియన్స్ చేయడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

వెంకటేష్ దగ్గుబాటి మాట్లాడుతూ .. ‘రానా నాయుడు’ లాంటి ఎగ్జైటింగ్ షో కోసం మొదటిసారిగా మా అన్నయ్య గారి అబ్బాయితో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు థ్రిల్‌గా అనిపించింది. నాగ పాత్రను పోషించడం నాకు పూర్తిగా కొత్త అనుభవం. నేను ఇంతకు ముందు ఇలాంటి పాత్రలో నటించలేదు. నాగ ఒక రిఫ్రెష్ చేంజ్. ఈ పాత్ర తెలివైన, ఆకర్షణీయమైన లేయర్లుగా వుంటుంది. నా అభిమానులు ఏం చెబుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు చాలా విధాలుగా కొత్తది. ఈ సిరీస్‌లో ప్రతిభావంతులైన దర్శకులు, నిర్మాతల బృందంతో కలిసి పనిచేయడం నిజంగా అద్భుతమైన అనుభవం.

South india All Time Biggest Grossing Movies: RRR,KGF 2,కాంతారా సహా సౌత్‌లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు..

షోరన్నర్ కరణ్ అన్షుమాన్ మాట్లాడుతూ, "ఈ కథా ప్రయాణంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. రానా నాయుడు పట్ల ప్రేక్షకులు మా ఉత్సాహాన్ని పంచుకుంటారని ఆశిస్తున్నాను.సుందర్‌ , సుపర్న్, మిగిలిన బృందం కలసి పని చేయడం ఎంతో మంచి అనుభవం. ఈ సిరిస్ లో కుటుంబం, అధికారం, నైతికత అంతర్భాగం - ఒక ప్రత్యేకమైన తండ్రి-కొడుకుల బంధం థీమ్‌ . అలాగే హై -స్టేక్స్ యాక్షన్, సీట్ ఎడ్జ్ డ్రామా, కొన్నిచక్కని రచన, అత్యుత్తమ ప్రదర్శనలతో నిరంతరం బౌండరీలని దాటుతుంది. కొన్ని బిగ్ సర్ ప్రైజ్ లకు సిద్ధంగా ఉండన్నారు.

మోనికా షెర్గిల్, విపి - కంటెంట్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా మాట్లాడుతూ “రానా దగ్గుబాటి , వెంకటేష్ దగ్గుబాటిలని మొదటిసారి కలసి స్క్రీన్‌పై తండ్రీ కొడుకులుగా అద్భుతంగా చేసిన ప్రదర్శన ‘రానా నాయుడు’ మా ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తుంది. అద్భుతమైన తారాగణం, థ్రిల్లింగ్ ప్లాట్ ట్విస్ట్‌లతో కూడిన యాక్షన్-ప్యాక్డ్ డ్రామా ఈ రానా వర్సెస్ నాగ యుద్ధం మన ప్రేక్షకుల ఒక పక్షం వహించేలా చేస్తుంది. మీరు రానా లేదా నాగ ఎవరి వైపు ఉంటారు?

NTR: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాకుడు ఎన్టీఆర్‌కు కేంద్రం అరుదైన గౌరవం..

మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా  విడుదలైనప  ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌‌కు సంబంధించిన ప్రమోషన్స్ వేగం పెంచారు. వెంకీ కొత్త మేకోవర్‌లో కొత్తగా కనిపిస్తున్నారు.  మొత్తంగా ఒకే స్క్రీన్ పై బాబాయి, అబ్బాయిలను చూడాలనుకున్న అభిమానులకు ఈ వెబ్  సిరీస్ పండగే అని చెప్పాలి. మొత్తంగా థ్రిల్లర్ ఎలిమెంట్‌తో వెంకటేష్, రానా నెట్‌ప్లిక్స్‌లో సందడి చేయనున్నారు.

ఇక వెంకటేష్ .. లాస్ట్ ఇయర్  ‘ఎఫ్ 3’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. దాంతో పాటు ‘ఓరి దేవుడా’ మూవీతో పర్వాలేదనిపించాడు.  ప్రస్తుతం వెంకటేష్.. సల్మాన్‌ ఖాన్‌తో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ యేడాది ఈద్ కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు రానా కూడా వరుస సినిమాలతో దుమ్ము దులుపుతున్నాడు. గతేడాది పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’, విరాట పర్వం సినిమాలతో పలకరించారు.

First published:

Tags: Bollywood news, Netflix, Rana daggubati, Rana Naidu Web Series, Tollywood, Venkatesh

ఉత్తమ కథలు