హోమ్ /వార్తలు /సినిమా /

Venkatesh -Rana Naidu: రానా నాయుడు ప్రమోషన్స్‌‌‌లో భాగంగా వెంకీ మామ వార్నింగ్..

Venkatesh -Rana Naidu: రానా నాయుడు ప్రమోషన్స్‌‌‌లో భాగంగా వెంకీ మామ వార్నింగ్..

రానా నాయుడులో వెంకటేష్ (File/Photo)

రానా నాయుడులో వెంకటేష్ (File/Photo)

Venkatesh -Rana - Rana Naidu: గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్...ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈయన రానాతో కలిసి ‘రానా నాయుడు వెబ్ సిరీస్ చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Venkatesh -Rana - Rana Naidu: గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్...ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నారు. గతేడాది వరుణ్ తేజ్‌తో చేసిన ‘ఎఫ్ 3’ మూవీతో మరో సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత విశ్వక్‌ సేన్‌తో ‘ఓరి దేవుడా’ మూవీలో దేవుడి పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈయన అబ్బాయి   రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ కంప్లీట్ చేశారు.  ‘రానా నాయుడు’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌ హిందీతో పాటు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో  వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు.గతంలో వీళ్లిద్దరు  ‘కృష్ణం వందే జగద్గురుం’  సినిమాలో ఓ పాటలో దగ్గుబాటి బాబాయి అబ్బాయి కలిసి నటించారు. కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు.

ఇపుడు ఆ కోరిక ఈ వెబ్ సిరీస్‌తో నెరవేరబోతుంది.  మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్‌లకు పనిచేసిన సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ డైరెక్ట్ చేసారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌‌కు సంబంధించిన ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ నేపథ్యంలో వెంకటేష్.. బీ థాంక్స్ ఫుల్.. వార్నింగ్ దే రహా హూ.. ఇత్నే బడా దిల్ వాలే బాప్.. కుచ్ లక్కీ లోగోకు మిల్తా హై రానా అంటూ హిందీలో వెంకటేష్ చెప్పిన డైలాగ్‌‌ను రిలీజ్ చేసారు. దీని తెలుగులో మీనింగ్ ఏమిటంటే.. మీకు వార్నింగ్ ఇస్తున్నాను.. ఇంత మంచి మనసున్న నాన్న కొంత మంది అదృష్టవంతులకు మాత్రమే దక్కుతుంది అని వెంకటేష్ చెప్పారు.

ఈ వెబ్ సిరీస్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్‌తో కూడి ఉంది. ఇప్పటికే విడుడల చేసిన టీజర్‌లో రానా గ్యాంగ్ స్టర్ పాత్రలో అదరగొట్టారు. ఇక వెంకటేష్ కూడా గుబురు గడ్డంతో తన ఏజ్‌కు తగ్గ పాత్రలో సాల్డ్ అండ్ పెప్పర్ లుక్‌లో కేక పుట్టిస్తున్నాడు. వెంకీ కొత్త మేకోవర్‌లో కొత్తగా కనిపిస్తున్నారు.  మొత్తంగా ఒకే స్క్రీన్ పై బాబాయి, అబ్బాయిలను చూడాలనుకున్న అభిమానులకు ఈ వెబ్  సిరీస్ పండగే అని చెప్పాలి. మొత్తంగా థ్రిల్లర్ ఎలిమెంట్‌తో వెంకటేష్, రానా నెట్‌ప్లిక్స్‌లో సందడి చేయనున్నారు. ఇక తెలుగులో ఈ టీజర్ విడుదల చేస్తే ఆ రేంజ్ వేరే లెవల్లో ఉండే అవకాశం ఉంది. నెటిజన్స్ కూడా తెలుగులో కూడా ఈ టీజర్ విడుదల చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఇక వెంకటేష్ .. లాస్ట్ ఇయర్  ‘ఎఫ్ 3’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. దాంతో పాటు ‘ఓరి దేవుడా’ మూవీతో పర్వాలేదనిపించాడు.  ప్రస్తుతం వెంకటేష్.. సల్మాన్‌ ఖాన్‌తో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ యేడాది ఈద్ కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు రానా కూడా వరుస సినిమాలతో దుమ్ము దులుపుతున్నాడు. గతేడాది పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’, విరాట పర్వం సినిమాలతో పలకరించారు.

First published:

Tags: Netflix, Rana daggubati, Rana Naidu Web Series, Tollywood, Venkatesh

ఉత్తమ కథలు