హోమ్ /వార్తలు /సినిమా /

Venkatesh-Rana: వెంకటేష్, రానా మల్టీస్టారర్‌కు ముహూర్తం ఖరారు.. క్రేజీ టైటిల్‌తో వస్తోన్న బాబాయి అబ్బాయి..

Venkatesh-Rana: వెంకటేష్, రానా మల్టీస్టారర్‌కు ముహూర్తం ఖరారు.. క్రేజీ టైటిల్‌తో వస్తోన్న బాబాయి అబ్బాయి..

రానా వెంకటేష్ (Rana venkatesh)

రానా వెంకటేష్ (Rana venkatesh)

Venkatesh-Rana Daggubagti Multistarer | వెంకటేష్, రానా మల్టీస్టారర్‌కు ముహూర్తం ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.

  Venkatesh-Rana Daggubagti Multistarer  | వెంకటేష్, రానా మల్టీస్టారర్‌కు ముహూర్తం ఖరారైందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. తెలుగులో గత కొన్నేళ్లుగా సీనియర్ టాప్ స్టార్ వెంకటేష్.. వరుసగా వేరే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ మల్టీస్టారర్ మూవీలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు వేరే హీరోలతో కలిసి మల్టీస్టారర్ మూవీలు చేసిన వెంకటేష్.. గతేడాది మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేసాడు. తాజాగా వెంకటేష్.. అబ్బాయి రానాతో కలిసి మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే వీళ్లిద్దరు కలిసి నటించబోయే సినిమాకు సంబంధించిన కథ కూడా రెడీ అయినట్టు సమాచారం. ఈ చిత్రం తమిళంలో హిట్టైన ఓ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ అని చెబుతున్నారు. ఈ మూవీని వీరూ పోట్ల డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి. మరోవైపు బాబాయి అబ్బాయి.. తొలి సారి పూర్తి స్థాయిలో కలిసి నటించబోతున్న ఈ చిత్రానికి ‘వెంకీ బాబాయి’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. త్వరలో బాబాయి, అబ్బాయిల మల్టీస్టారర్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఒకవేళ ఐతే.. వెంకటేష్ బర్త్ డే డిసెంబర్ 13న  ఈ సినిమా ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

  Venkatesh, Rana multistarrer muhurtham finalized and movie title is Venky Babai,venkatesh,Venkatgesh Narappa shooting Resumed,venkatesh rana,venaktesh rana daggubati venky babai,venky babai,venky mama venky babai,venaktesh twitter,venaktesh insgtagram,venaktesh naarappa,venaktesh srikantha addala,venaktesh drishyam sequel,venkatesh tarun bhaskar,venkatesh anil ravipudi f3 sequel,venkatesh drishyam sequel plan,venkatesh crazy project,tollywood,telugu cinema,వెంకటేష్,వెంకటేష్ నారప్ప,వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల,వెంకటేష్ దృశ్యం సీక్వెల్,దృశ్యం సీక్వెల్‌లో వెంకటేష్,మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో వెంకటేష్,వెంకటేష్ రానా దగ్గుబాటి,రానా వెంకటేష్ వెంకీ బాబాయి,వెంకీ బాబాయిగా వెంకటేష్
  బాబాయి అబ్బాయి వెంకటేష్, రానా (File/Photo)

  ప్రస్తుతం వెంకటేష్.. తమిళంలో ధనుశ్ హీరోగా హిట్టైన ‘అసురన్’ మూవీని ‘నారప్ప’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీటైన ఈ చిత్రం మిగిలిన షూటింగ్ రీసెంట్‌గా ప్రారంభమైంది. ఈ చిత్రం తర్వాత వెంకటేష్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. దాంతో పాటు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాను తరుణ్ భాస్కర్.. గుర్రపు పందాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాల తర్వాత బాబాయి అబ్బాయి వెంకటేష్ ,రానాల మల్టీస్టారర్ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం రానా కూడా చేతిలో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన తర్వాత ‘వెంకీ బాబాయి’ సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Rana daggubati, Telugu Cinema, Tollywood, Venkatesh

  ఉత్తమ కథలు