VENKATESH RANA DAGGUBATI WEB SERIES RANA NAIDU IN NETFLIX OFFICIALLY ANNOUNCED TA
Venkatesh - Rana : బాబాయ్ అబ్బాయి వెంకటేష్, రానాల వెబ్ సిరీస్.. అధికారిక ప్రకటన..
వెంకటేష్, రానా దగ్గుబాటి (Twitter/Photo)
Venkatesh - Rana : టాలీవుడ్ బాబాయ్ అబ్బాయిలైన వెంకటేష్, రానాలు కలసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసారు. వివరాల్లోకి వెళితే..
Venkatesh - Rana Daggubati : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు నటిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. మరోవైపు నాగార్జున, నాగ చైతన్య కూడా ‘బంగార్రాజు’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఇక వెంకటేష్ కూడా తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘ప్రేమమ్’తో పాటు ‘వెంకీ మామ’ సినిమాలో కలిసి నటించారు. ఇపుడు వెంకటేష్.. తన అన్నయ్య కుమారుడు రానా దగ్గుబాటితో కలిసి పూర్తి స్థాయిలో కలసి నటించబోతున్నారు. కానీ వీరిద్దరు కలిసి సినిమాలో కాకుండా.. నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
‘రానా నాయుడు’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. గతంలో వీళ్లిద్దరు ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ఓ పాటలో దగ్గుబాటి బాబాయి అబ్బాయి కలిసి నటించారు. కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు. ఇపుడు ఆ కోరిక ఈ వెబ్ సిరీస్‌తో నెరవేరనుంది. దీంతో రానా ఎంతో భావోద్వేగానికి గురవుతూ తన గురువు గారైన బాబాయితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Always wanted to share the screen with my uncle the VICTORY V @VenkyMama and my dream is finally coming true. As much as I love him off screen, in “Rana Naidu” we are going to be at each other's throats. #RanaNaidu, coming soon on Netflix. pic.twitter.com/oCzjwOcIuF
ఈ మధ్యనే వెంకటేష్ ‘నారప్ప’ మూవీలో పలకరించారు. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు రానా హీరోగా నటించిన ‘విరాట పర్వం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తారా లేదా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు రానా, పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. డేనియల్ శేఖర్‌గా రానా లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలచేస్తున్నారు. మరోవైపు వెంకటేష్, రానా కలిసి వెబ్ సిరీస్‌తో పాటు ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ విషయమై అపీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. మరోవైపు వెంకటేష్.. వరుణ్ తేజ్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ మూవీ చేస్తున్నారు. దాంతో పాటు పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. రీసెంట్గా వెంకటేష్ హీరోగా 35 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.