హోమ్ /వార్తలు /సినిమా /

Rana Naidu: OTTలోకి రానా నాయుడి ఎంట్రీ.. రామానాయుడు స్టూడియోస్‌లో సెలబ్రిటీల హంగామా

Rana Naidu: OTTలోకి రానా నాయుడి ఎంట్రీ.. రామానాయుడు స్టూడియోస్‌లో సెలబ్రిటీల హంగామా

Rana Naidu

Rana Naidu

Venkatesh | Rana: రానా నాయుడు రూపంలో సరికొత్త అడుగు వేశారు బాబాయి అబ్బాయిలైన వెంకటేష్, రానాలు. నేటి నుంచి (మార్చి 10) ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌‌ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మల్టీస్టారర్ సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చే హీరో వెంకటేష్ (Venkatesh). తోటి హీరోతో తెర పంచుకోవడానికి ఎప్పుడూ ముందుండే ఈ సీనియర్ హీరో.. ఇప్పుడు దగ్గుబాటి రానాతో (Daggubati Rana) జత కట్టారు. రానా నాయుడు (Rana Naidu) రూపంలో సరికొత్త అడుగు వేశారు. బాబాయి అబ్బాయిలైన వెంకటేష్, రానాలు తొలిసారి ఓ వెబ్ సిరీస్‌లో కలిసి పూర్తిస్థాయిలో నటించారు. నేటి నుంచి (మార్చి 10) ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌‌ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది.

అయితే ఈ రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రీమియర్స్ ని హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ షోకి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. రానా నాయుడు చూసి చాలా బాగుందని చెప్పారు. ఈ మేరకు రామానాయుడు స్టూడియోస్ లో సెలబ్రిటీస్ సందడి చేసిన ఫోటొస్ వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే పలువురు హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేసిన వెంకటేష్.. రీసెంట్‌గా వరుణ్ తేజ్‌తో కలిసి F3 రూపంలో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీ మెంబర్, అన్న సురేష్ బాబు కుమారుడు దగ్గుబాటి రానాతో కలిసి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. బాబాయి, అబ్బాయిలు క‌లిసి ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించ‌నుండటంతో ప్రేక్ష‌కుల్లో ఓ రకమైన ఆస‌క్తి నెల‌కొంది.

ఈ వెబ్ సిరీస్‌ హిందీతో పాటు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు.గతంలో వీళ్లిద్దరు ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ఓ పాటలో దగ్గుబాటి బాబాయి అబ్బాయి కలిసి నటించారు. కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు. ఇపుడు ఆ కోరిక ఈ వెబ్ సిరీస్‌తో నెరవేరింది. ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా నటించారు వెంకటేష్, రానా. వెంకటేష్, రానాలకు ఇదే ఫస్ట్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ అమెరికన్ సిరీస్ రే డోనోవన్‌కు భారతీయ అడాప్షన్.

‘రానా నాయుడు’ లాంటి ఎగ్జైటింగ్ షో కోసం మొదటిసారిగా మా అన్నయ్య గారి అబ్బాయితో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు థ్రిల్‌గా అనిపించింది అని వెంకటేష్ అన్నారు. నాగ పాత్రను పోషించడం నాకు పూర్తిగా కొత్త అనుభవం. నేను ఇంతకు ముందు ఇలాంటి పాత్రలో నటించలేదు. నాగ ఒక రిఫ్రెష్ చేంజ్. ఈ పాత్ర తెలివైన, ఆకర్షణీయమైన లేయర్లుగా ఉంటుందని చెప్పారు.

First published:

Tags: Rana Naidu Web Series, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు