Venkatesh - Rana : బాలీవుడ్‌లో వెంకటేష్, రానా మల్టీస్టారర్.. బాబాయి అబ్బాయి కొత్త ఇన్నింగ్స్..

రానా వెంకటేష్ (Rana venkatesh)

Venkatesh - Rana : బాలీవుడ్‌లో వెంకటేష్, రానా మల్టీస్టారర్ మూవీ చేయనున్నారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.

  • Share this:
    Venkatesh - Rana : బాలీవుడ్‌లో వెంకటేష్, రానా మల్టీస్టారర్ మూవీ చేయనున్నారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. టాలీవుడ్ హీరోలైన వెంకటేష్, రానాలు పలువురు హీరోలతో కలిసి పలు మల్టీస్టారర్ మూవీలు చేసారు. కానీ వీళ్లిద్దరు కలిసి మాత్రం నటించలేదు. కానీ ‘కృష్ణం వందే జగద్గురుం’  సినిమాలో ఓ పాటలో దగ్గుబాటి బాబాయి అబ్బాయి కలిసి నటించారు. కానీ వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో మాత్రం నటించలేదు. త్వరలోనే వీళ్లిద్దరు కలిసి ఓ మల్టీస్టారర్ చేయనున్నారు. అది కూడా బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌లో ఈ బాబాయి అబ్బాయి కలిసి నటించబోతున్నట్టు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెంకటేష్, రానాలతో ఓ వెబ్ సిరీస్‌ ప్లాన్  చేస్తోంది. ఇది తెలుగుతో పాటు వివిధ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.

    ‘ఘర్షణ’ తరహాలో ఇందులో వెంకటేష్, రానాలు పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించబోతున్నట్టు సమాచారం. వీళ్లిద్దరు వాళ్ల  ప్రాజెక్ట్స్ ఫ్రీ అయిన తర్వాత ఈ వెబ్ సిరీస్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.  ఈ వెబ్ సిరీస్‌ను గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం.

    Venkatesh varun tej F3 movie release date, Venkatesh f3, Rana virataparvam movie, Rana haati meri saathi movie, Tollywood news, వెంకటేశ్ ఎఫ్ 3 మూవీ, వెంకటేశ్ మూవీ రిలీజ్ తేదీ, రానా విరాటపర్వం, రానా హాథీ మేరీ సాథీ, టాలీవుడ్ న్యూస్
    వెంకటేశ్, రానా (Twitter/Photo)


    ప్రస్తుతం వెంకటేష్.. ‘ఎఫ్ 3’ మూవీతో పలకరించనున్నారు. లేెటెస్ట్ వెంకటేష్‌తో ‘నారప్ప’ మూవీలో పలకరించారు. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు రానా హీరోగా నటించిన ‘విరాట పర్వం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తారా లేదా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు రానా, పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలచేస్తున్నారు. మరోవైపు వెంకటేష్, రానా కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ విషయమై అపీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

    ఇవి కూడా చదవండి.. 

    నందమూరి నట సింహా బాలకృష్ణ తన ఫిల్మీ కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..

    Sarkaru Vaari Paata - Pushpa : సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మహేష్, బన్ని నిర్మాతలు..


    నాగ చైతన్య టూ సత్యదేవ్.. బాలీవుడ్‌లో బాట పడుతున్న టాలీవుడ్ హీరోలు..

    ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌కు రాజమౌళి మరో బిగ్ షాక్ ఇవ్వనున్నారా.. ?
    Published by:Kiran Kumar Thanjavur
    First published: