ప్రస్తుతం అంతా సూపర్ హిట్ సినిమాల రీరిలీజ్‌లు ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. పోకిరి నుంచి మొదలైన ఈ ట్రెండ్ తాజాగా ప్రభాస్ బిల్లా వరకు కొనసాగింది. ఇక ఈ ట్రెండ్‌లోకి విక్టరీ వెంకటేష్ వచ్చారు. డిసెంబర్ 13న వెంకటేష్ (Venkatesh) పుట్టినరోజు సందర్భంగా నారప్ప (Narappa) చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సురేష్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఒక్క రోజు మాత్రమే నారప్పను థియేటర్లలో ప్రదర్శించనున్నారు. మంచి కథ, కథనాలతో వచ్చిన ఈసినిమా లాక్డౌన్ కారణంగా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. యాక్షన్ డ్రామా జోనర్లో తెరకెక్కిన నారప్ప చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తమిళ సినిమా అసురన్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చింది 'నారప్ప'. ఈ సినిమాలో ఏమోషనల్ సీన్స్‌లో వెంకటేష్ అదరగొట్టారు. ఒరిజినల్ వెర్షన్ కి ఎక్కడా తగ్గకుండా శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala ) టేకింగ్ కానీ చూపించిన విజువల్స్ కేక పెట్టించాయి. అలాగే వెంకటేష్, ప్రియమణిల నటన మరో ఎత్తుకు తీసుకెళ్తుందని చెప్పోచ్చు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడ అదిరింది. రెండు పాత్రల్లో వెంకీ ఇరగదీశారు. ప్రియమణి హీరోయిన్గా చేసింది. ఇతర పాత్రల్లో కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల, రావు రమేశ్, నాజర్, రాఖీ నటించారు.
ఇక ఈ సినిమా టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సామ్.కె నాయుడు అందించంగా మణిశర్మ సంగీతం అందించారు. ఎడిటర్ గా మార్తాండ్ కె. వెంకటేష్ పని చేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నారప్ప తమిళ సినిమా 'అసురన్’కు రీమేక్‌గా వస్తోంది. తమిళంలో ధనుష్ నటించిన ఆ సినిమా దళిత నేపథ్య కథతో వచ్చి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తమిళ మాతృకను వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ధనుష్‌కు జంటగా మళయాల నటి మంజు వారియర్ నటించిగా.. అదే పాత్రలో తెలుగులో ప్రియమణి కనిపించారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు.
VICTORY @VenkyMama's Raging Blockbuster #Narappa is all set to release on Dec 13th (for only one day) across theatres in AP & Telangana!! ????????#NarappaInTheatres#Priyamani@KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @sureshprodns @theVcreations @PrimeVideoIN pic.twitter.com/Q4u4VeLQXs
— Suresh Productions (@SureshProdns) December 6, 2022
ఇక వెంకటేష్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఎఫ్2కు సీక్వెల్‌గా వచ్చిన ఎఫ్3లో నటించారు. అయితే F2తో పోలిస్తే.. ఎఫ్3 ఆకట్టుకోలేకపోయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చింది. ఎఫ్ 2 మూవీకి సీక్వెల్‌గా అని చెప్పినా.. అదే నటీనటులతో కొత్త కాన్సెప్ట్‌తో ఎఫ్ 3 మూవీ తెరకెక్కించారు. రొటీన్ కామెడీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. వెంకటేష్, వరుణ్‌లకు జంటగా తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు నిర్మించారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. మరో ఇంట్రెస్టింగ్ రోల్లో సోనాల్ చౌహన్ కనిపించింది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. అనిల్ రావిపూడి కేవలం ఈ సినిమా టైటిల్‌ను మాత్రమే వాడుకొని అవే పాత్రలతో ఎఫ్ 3 మూవీని తెరకెక్కించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero venkatesh, Naarappa, Tollywood news