Home /News /movies /

VENKATESH POOJA HEGDE WILL PLAY SISTER ROLE IN SALMAN KHANS KABHI EID KABHI DIWALI MOVIE TA

Venkatesh - Pooja Hegde : వెంకటేష్‌ చెల్లెలి పాత్రలో పూజా హెగ్డే.. ఏ సినిమాలో తెలుసా..

ఎఫ్ 3లో చెలి.. మరో చిత్రంలో వెంకీకి చెల్లి పాత్రలో పూజా హెగ్డే (Twitter/Photo)

ఎఫ్ 3లో చెలి.. మరో చిత్రంలో వెంకీకి చెల్లి పాత్రలో పూజా హెగ్డే (Twitter/Photo)

Venkatesh - Pooja Hegde : హీరో వెంకటేష్ కేవలం హీరోగానే కాకుండా... కథ డిమాండ్ చేస్తే రెండో హీరోగా నటించడానికి సై అంటున్నారు. తాజాగా ఈయన సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ఓ బాలీవుడ్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అందులో పూజా.. వెంకీ చెల్లి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
    Venkatesh - Pooja Hegde : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా సినిమాల హవా నడస్తోంది. బాలీవుడ్ టాప్ హీరోలు సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు. మరోవైపు దక్షిణాదికి చెందిన హీరోలు హిందీ సినిమాల్లో నటిస్తూ ప్యాన్ ఇండియా హద్దులు చెరిపేస్తున్నారు. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ (RRR) మూవీలో అజయ్ దేవ్‌గణ్.. రామ్ చరణ్ తండ్రి పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసారు. మరోవైపు సంజయ్ దత్ కూడా కేజీఎఫ్ ఛాప్టర్‌ 2 (KGF Chapter 2) లో అథిరాగా నటించి మెప్పించారు. ఇంకోవైపు సల్మాన్ ఖాన్.. తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘గాడ్‌ ఫాదర్’ (God Father) లో సినిమాకు సంబంధించిన కీలక పాత్రలో నటించారు. మరోవైపు తెలుగు, తమిళ హీరోలు కూడా హిందీలో నటిస్తున్నారు. ఇప్పటికే పలువురు దక్షిణాది హీరోలు బాలీవుడ్ ‌లో నటించి మెప్పించన సంగతి తెలిసిందే కదా.

    ఇప్పటికే తెలుగు నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలు బాలీవుడ్‌లో అడపదడపా నటించారు. ఇక నాగార్జున కూడా రీసెంట్‌గా హిందీలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న ‘బ్రహ్మాస్త్ర’లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటకే ఆయన రోల్‌కు సంబంధించిన షూట్ కంప్లీటైంది. తాజాగా వెంకటేష్.. చాలా యేళ్ల తర్వాత హిందీలో నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘కభీ ఈద్ కభీ దివాళీ’ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఈయన హీరోయిన్ పూజా హెగ్డే అన్న పాత్రలో నటిస్తున్నారట. అంతేకాదు వెంకటేష్ హీరోగా నటించిన ‘ఎఫ్ 3’లో పూజా హెగ్డే  ఐటెం సాంగ్‌లో మెరిసింది. మొత్తంగా ఎఫ్ 3లో చెలి పాత్రలో నటించిన పూజా హెగ్డే.. సల్మాన్ ఖాన్ చిత్రంలో వెంకటేష్ చెల్లి పాత్రలో నటించడం విశేషం.

    Prabhas -Salaar : ప్రభాస్ ‘సలార్’ కోసం అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్..

    ఇక వెంకటేష్ నటించిన ఎఫ్ 3 విషయానికొస్తే.. ఈ సినిమాలో వెంకటేష్ .. రే చీకటితో బాధపడే వ్యక్తి పాత్రలో నటిస్తే.. వరుణ్ తేజ్.. నత్తితో బాధపడే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. వీళ్ల కామెడీ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనుంది.  అనిల్ రావిపూడి రీసెంట్‌గా జరిగిన పలు ఇంటర్వ్యల్లో ప్రస్తావించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

    F3లో ఐటెం సాంగ్ చేసిన పూజా హెగ్డే (Twitter/Photo)


    ఎఫ్ 3 చిత్రాన్ని మే 27న  విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.   ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ నటించారు. వీరితో పాటు హిందీ నటుడు బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్ నటించారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని టాక్.తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్ మరింత కామెడీ ఉంటుందని.. పొట్టలు చెక్కలయ్యేలా అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు.

    Sarkaru Vaari Paata 5 Days WW Collections : మహేష్ బాబు ’సర్కారు వారి పాట’ 5 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

    అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేఅనేది ఈ సినిమా కథ అంటున్నారు. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. గతేడాది వెంకటేష్ హీరోగా నటించిన ‘నారప్ప’, దృశ్యం 2 ఈ సినిమాలు ఓటీటీ వేదికగా విడులైన మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. మరోవైపు వరుణ్ తేజ్ రీసెంట్‌గా ‘గని’మూవీతో పలకరించారు. మరి ఎఫ్ 3 మూవీతో వెంకటేష్, వరుణ్ తేజ్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సత్తా చూపిస్తారో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Pooja Hegde, Salman khan, Tollywood, Venkatesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు