వెంకటేష్ నెక్ట్స్ మల్టీస్టారర్ ఆ తమిళ స్టార్ హీరోతోనేనా..

రీసెంట్‌గా ఈ సంక్రాంతికి  వరుణ్ తేజ్‌తో చేసిన ‘ఎఫ్2’ తో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. అంతేకాదు ఇపుడు మేనల్లుడు నాగచైతన్యతో ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. వీటితో వెంకటేష్ మరో మల్టీస్టార్ చేయడానికి ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. 

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 25, 2019, 8:44 AM IST
వెంకటేష్ నెక్ట్స్ మల్టీస్టారర్ ఆ తమిళ స్టార్ హీరోతోనేనా..
వెంకటేష్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 25, 2019, 8:44 AM IST
గత కొన్నేళ్లుగా సీనియర్ హీరో వెంకటేశ్...ఎలాంటి ఈగోలకు పోకుండా ఆయన తోటి హీరోలతో మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వస్తున్నాడు. కెరీర్ ప్రారంభంలో కొన్ని మల్టీస్టారర్ మూవీలు చేసినా వెంకీ...ఆ మధ్య కమల్ హాసన్‌తో చేసిన ‘ఈనాడు’ మూవీతో తెలుగులో ఈ ట్రెండ్‌ను మళ్లీ ప్రారంభించాడు. ఆ తర్వాత మహేష్, పవన్, రామ్‌లతో మల్టీస్టారర్ సినిమాలు చేసిన మంచి సక్సెస్ అందుకున్నాడు.

రీసెంట్‌గా ఈ సంక్రాంతికి  వరుణ్ తేజ్‌తో చేసిన ‘ఎఫ్2’ తో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. అంతేకాదు ఇపుడు మేనల్లుడు నాగచైతన్యతో ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. వీటితో వెంకటేష్ మరో మల్టీస్టార్ చేయడానికి ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. 

Venkatesh Next Multistarer Movie With Kamal Haasan,వెంకటేష్ నెక్ట్స్ మల్టీస్టారర్ ఆ తమిళ స్టార్ హీరోతోనేనా..Telugu Senior Hero Venkatesh Will do Another Multistarer, Tollywood Hero Venkatesh, Venkatesh Accepted Antoher Multistarer movie, venkatesh Kamal Haasan Multistarer, Venkatesh Kamal haasan Srikanth Addala Multistarer, వెంకటేష్ మల్టీస్టారర్, వెంకటేష్ కమల్ హాసన్ మల్టీస్టారర్, వెంకటేష్ కమల్ హాసన్ శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్, తెలుగు సినిమా హీరో వెంకటేష్
వెంకీ మామలో నాగ చైతన్య, వెంకటేశ్


 తాజాగా వెంకటేష్..శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఓకే చెప్పడట. కానీ ఈ సినిమాలో మరో హీరోగా కమల్ హాసన్ నటించేందకు ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం కమల్ హాసన్..శంకర్‌తో ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నాడు. అంతేకాదు గత కొన్నేళ్లుగా ఇదే తన చివరి చిత్రమని ఈ సినిమా తర్వాత సినిమాలకు పులిస్టాప్ పెట్టి తన పూర్తి దృష్టిని రాజకీయాలకే కేటాయించ బోతున్నట్టు చెప్పాడు. మరీ కమల్ హాసన్ మనుసు మార్చుకొని వెంకటేష్‌తో మరో మల్టీస్టారర్‌కు ఓకే చెబుతాడా ?  ఒకవేళ ఓకే చెప్పిన శ్రీకాంత్ అడ్డాల దగ్గర వీళ్లిద్దరికి ఇమేజ్‌కు తగ్గ కథ ఉందా ? మొత్తానికి వెంకటేష్, కమల్ హాసన్‌లతో శ్రీకాంత్ అడ్డాల మల్టీస్టారర్‌పై క్లారిటీ రావాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

నివేదా హేతురాజ్ ఫోటోస్ 

Loading...
ఇది కూడా చదవండి 

రాజమౌళి సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఏమిటో తెలిసిపోయింది..!

సమంతను నమ్మి కోట్లు పెడుతున్న నాని.. ఏం జరుగుతుందో మరి..?

‘మిస్ట‌ర్ మ‌జ్ను’ ప్రివ్యూ.. అఖిల్ తొలి హిట్ కొడతాడా..?
First published: January 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...