త్రివిక్రమ్‌తో వన్స్‌మోర్: నువ్వు నాకు నచ్చావ్ అంటున్న వెంకటేష్

త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత స్టార్ హీరోలను.. అందులోనూ నెంబర్ వన్ స్థానానికి పోటీ పడుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో మాత్రమే త్రివిక్రమ్ సినిమాలు చేస్తూ వచ్చాడు.

news18-telugu
Updated: January 9, 2019, 11:30 PM IST
త్రివిక్రమ్‌తో వన్స్‌మోర్: నువ్వు నాకు నచ్చావ్ అంటున్న వెంకటేష్
త్రివిక్రమ్‌తో వన్స్‌మోర్: 'నువ్వు నాకు నచ్చావ్' అంటున్న వెంకటేష్
  • Share this:
త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత స్టార్ హీరోలను.. అందులోనూ నెంబర్ వన్ స్థానానికి పోటీ పడుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలతో మాత్రమే త్రివిక్రమ్ సినిమాలు చేస్తూ వచ్చాడు. తన మార్కు మాటలను జోడిస్తూ.. చాలా సేఫ్‌గా సినిమాలు చేశాడు. మధ్యలో నితిన్ లాంటి హీరోలతో సినిమా చేసినా.. దాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ తన పంథా మార్చుకోబోతున్నాడు త్రివిక్రమ్. ఈయన త్వరలోనే వెంకటేష్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా కమిట్ అయిన మాటల మాంత్రికుడు, ఆ తర్వాత చిరంజీవి సినిమా ఒప్పుకున్నాడు. కానీ చిరంజీవి సినిమా కంటే ముందే వెంకటేష్‌తో సినిమా చేయబోతున్నాడు. తాజాగా F2 సినిమా ప్రమోషన్‌లో భాగంగా వెంకటేష్ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 'వెంకీ మామ' సినిమాతో పాటు త్రివిక్రమ్ సినిమా కూడా లైన్లో ఉందని క్లారిటీ ఇచ్చాడు వెంకటేష్.

చిరంజీవి.. ప్రస్తుత సినిమాతో పాటు కొరటాల శివ సినిమా కూడా పూర్తి చేయాలి. ఈ రెండు పూర్తి అవడానికి సమయం పడుతుంది. ఆ లోపు అల్లు అర్జున్ సినిమా పూర్తిచేసి వెంకటేష్ సినిమా మొదలుపెట్టనున్నారు మాటల మాంత్రికుడు. త్రివిక్రమ్ రచయితగా 'మల్లీశ్వరి', 'నువ్వు నాకు నచ్చావ్' లాంటి సినిమాలకు పనిచేసింది తెలిసిందే. దర్శకుడిగా మారిన తర్వాత చాలా ఏళ్ళకు వెంకటేష్ హీరోగా తన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్, ఎలా ఉండబోతుందో చూడాలి.
Published by: Suresh Rachamalla
First published: January 9, 2019, 11:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading