నారప్ప నువ్వు మాములోడివి కాదప్ప.. వెంకటేష్ నువ్వు సూపరప్ప..

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' పేరుతో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన

news18-telugu
Updated: March 19, 2020, 6:26 AM IST
నారప్ప నువ్వు మాములోడివి కాదప్ప.. వెంకటేష్ నువ్వు సూపరప్ప..
నారప్పలో వెంకటేష్ Twitter
  • Share this:
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' పేరుతో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ సంచలనం సృష్టించింది.  కాగా ఈ సినిమా తమిళ సినిమా 'అసురన్’కు రీమేక్‌గా వస్తోంది. తమిళంలో ధనుష్ నటించిన ఆ సినిమా తమిల నేపథ్య కథతో వచ్చి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తమిళ మాతృకను వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. ధనుష్‌కు జంటగా మళయాల నటి మంజు వారియర్ నటించింది. ఈ సినిమా అక్కడ దాదాపు  రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్. తెలుగులో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తోండగా ఆయనకు జంటగా ప్రియమణి నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైంది. ఇప్పటికే చిత్తూరు, అనంతపురంలలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను పిక్చరైజ్ చేసారు. ఈ షెడ్యూల్‌లోనే కొన్ని పోరాట సన్నివేశాలను తెరకెక్కించారట. తాజాగా ఈ  సినిమాకు షెడ్యూల్ పూర్తి కావడంతో ఈ సినిమాకు యూనిట్ హైదారాబాద్ బయలు దేరి వచ్చింది. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ రద్దు చేసారు. ఈ లోపే వెంకటేష్ ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు పూర్తి చేయడం విశేషం. దీంతో చిత్ర యూనిట్ వెంకటేష్‌ను అభినందిస్తున్నారు. అంతేకాదు ఈ షెడ్యూల్‌కు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్టు సమాచారం. ఈ కోవలోనే నారప్ప ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కాగానే మూట ముల్లే సర్దుకొని హైదరాబాద్ వచ్చేసింది. తదుపరి షెడ్యూల్ ఎప్పడనేది త్వరలో అనౌన్స్ చేస్తారట.

narappa news,asuran telugu remake narappa,asuran remake,asuran telugu remake naarappa,asuran telugu remake,narappa first look,narappa teaser,narappa,naarappa teaser,naarappa,naarappa first look,asuran vs naarappa,venkatesh naarappa teaser,asuran telugu,venkatesh narappa,narappa telugu movie,naarappa first look teaser,naarappa movie,naarappa trailer,latest telugu movies,narappa movie,naarappa tamil remake,narappa official teaser,asuran telugu remake,naarappa heroines,వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల,మణిశర్మ, ప్రియమణి హీరోయిన్‌,రెబ్బ మోనిక జాన్
నారప్పగా వెంకటేష్(Twitter/Photo)


టెక్నికల్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సామ్‌.కె నాయుడు అందిస్తుండగా, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్‌, ఆర్ట్‌ గాంధీ నడికుడికర్‌, కథ  వెట్రిమారన్‌, ఫైట్స్‌ పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌, లిరిక్స్‌ సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం రాస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

not only naarappa movie these are the remake movies from other languages done by tollywood hero venkatesh,naarappa,venkatesh naarappa,venaktesh naarappa dhanush asuran remake,venkatesh remake movies,venkatesh remake,Venkatesh,Venkatesh asuran,asuran movie collections,asuran movie review,dhanush asuran movie,dhanush asuran movie review,asuran telugu remake,asuran remake,venkatesh asuran movie,telugu cinema,వెంకటేష్,వెంకటేష్ అసురన్,అసురన్ రీమేక్,అసురన్ తెలుగు రీమేక్,తెలుగు సినిమా,వెంకటేష్ రీమేక్ కహాని,నారప్ప,నారప్ప వెంకటెష్,అసురన్ రీమేక్ నారప్ప
అసురన్ రీమేక్ నారప్పగా వెంకటేష్ (Twitter/Photo)


అసురన్‌లో ధనుశ్ డబుల్ రోల్లో యాక్ట్ చేసాడు. తెలుగులో మాత్రం వెంకటేష్‌తో పాటు మరో హీరోను తీసుకుంటారా ? లేదా వెంకటేష్ డ్యూయల్ రోల్లో యాక్ట్ చేస్తాడా అనేది చూడాలి.  ‘అసురున్’ చిత్ర విషయానికొస్తే.. కుల వ్యవస్థ దాని మూలంగా జరిగిన గొడవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ నేటివిటీకి ఈ కథ చక్కగా సరిపోయింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో హీరో.. ఊర్లో వాళ్ల కాళ్లు మొక్కడం.. ఆవు పేడ‌ను ధనుశ్ చేత్తో ఎత్తడం వంటి రియలిస్టిక్ సన్నివేశాలున్నాయి. తమిళ హీరోలు.. ప్రేక్షకులను అభిమానులను కాకుండా.. కథకున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆయా సన్నివేశాల్లో నటించారు. మరి తెలుగు ప్రేక్షకులు ఇటువంటి కథ, కథనం ఉన్న చిత్రాన్ని వెంకటేష్ ఏ మేరకు చేసి మెప్పిస్తాడనేది చూడాలి.
First published: March 19, 2020, 6:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading