నారప్పగా వెంకటేష్.. కొత్త లుక్‌తో అదరగొడుతున్న వెంకీ మామ..

కొత్త యేడాదిలో వెంకటేష్.. తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన సూపర్ హిట్ ‘అసురన్’ రీమేక్‌ను ఓకే చెప్పాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కలైపులి ఎస్.థానుతో కలిసి సురేష్ బాబు ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ సినిమా  రెగ్యులర్ షూటింగ్ పూజా కార్యక్రమాలతో  ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 22, 2020, 7:15 AM IST
నారప్పగా వెంకటేష్.. కొత్త లుక్‌తో అదరగొడుతున్న వెంకీ మామ..
‘నారప్ప’గా వెంకటేష్ (Twitter/Photos)
  • Share this:
గతేడాది మొదట్లో ‘ఎఫ్ 2’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీతో బోణి చేసిన వెంకటేష్.. ఇయర్ ఎండింగ్‌లో మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమాతో సక్సెస్‌తో మంచి ముగింపు పలికాడు. ఈ యేడాది మాత్రం.. తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన సూపర్ హిట్ ‘అసురన్’ రీమేక్‌ను ఓకే చెప్పాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కలైపులి ఎస్.థానుతో కలిసి సురేష్ బాబు ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ సినిమా  రెగ్యులర్ షూటింగ్ పూజా కార్యక్రమాలతో  ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. నేటి నుంచి 3 వారాల పాటు ఫస్ట్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసారు.  ఈ చిత్రానికి ‘నారప్ప’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. రాయలసీమలోని అనంతపురం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అంతేకాదు.. ఈ సినిమాలో వెంకటేష్ లుక్‌ను విడుదల చేసారు. ఈ లుక్‌లో వెంకటేష్ కొత్తగా కనిపిస్తున్నారు. తమిళంలో ధనుశ్ పాత్రలాగే వెంకటేష్ లుక్ ఉంది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తోంది.

venkatesh new movie naarappa first look go viral on social media,Venkatesh,Venkatesh asuran,Venkatesh asuran naarappa,asuran naarappa,asuran movie collections,asuran movie review,dhanush asuran movie,dhanush asuran movie review,asuran telugu remake,asuran remake,venkatesh asuran movie,telugu cinema,వెంకటేష్,వెంకటేష్ అసురన్,అసురన్ తెలుగు టైటిల్ నారప్ప,అసురన్ రీమేక్,అసురన్ తెలుగు రీమేక్,తెలుగు సినిమా
‘నారప్ప’పాత్రలో వెంకటేష్ (Twitter/Photos)


తమిళంలో ధనుశ్ డబుల్ రోల్లో యాక్ట్ చేసాడు. తెలుగులో మాత్రం వెంకటేష్‌తో పాటు రానాను తీసుకునే ఛాన్స్ ఉంది. ‘అసురున్’ చిత్ర విషయానికొస్తే.. కుల వ్యవస్థ దాని మూలంగా జరిగిన గొడవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ నేటివిటీకి ఈ కథ చక్కగా సరిపోయింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో హీరో.. ఊర్లో వాళ్ల కాళ్లు మొక్కడం.. ఆవు పేడ‌ను ధనుశ్ చేత్తో ఎత్తడం వంటి రియలిస్టిక్ సన్నివేశాలున్నాయి. తమిళ హీరోలు.. ప్రేక్షకులను అభిమానులను కాకుండా.. కథకున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆయా సన్నివేశాల్లో నటించారు. మరి తెలుగు ప్రేక్షకులు ఇటువంటి కథ, కథనం ఉన్న చిత్రాన్ని వెంకటేష్ ఏ మేరకు చేస్తాడనేది చూడాలి.

First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు