news18-telugu
Updated: November 5, 2020, 9:45 PM IST
నారప్ప షూటింగ్ ప్రారంభించిన వెంకటేష్ (Twitter/Photo)
Venkatesh-Narappa: సీనియర్ హీరోలు ఒక్కొక్కరుగా షూటింగ్లో జాయిన్ అవుతున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు ఆరేడు నెలలుగా షూటింగ్స్ లేక ఖాళీగా ఉన్న హీరోలు.. ఇపుడు స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటూ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే సీనియర్ హీరో నాగార్జున బిగ్‌బాస్‌తో పాటు ‘వైల్డ్‌డాగ్ సినిమాతో పాటు ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. అటు బాలకృష్ణ,బోయపాటి శ్రీను సినిమా కూడా రీసెంట్గా మొదలైంది. ఈ నెల 15 నుంచి బాలయ్య షూటింగ్లో జాయిన్ కానున్నాడు. మరోవైపు చిరంజీవి, కొరటాల శివ సినిమా ఈ నెల 9 నుంచి మొదలు కానుంది. తాజాగా మరో సీనియర్ హీరో వెంకటేష్ కూడా నారప్ప షూటింగ్లో ఈ గురువారం జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ షూటింగ్ మొదలైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
కరోనా లాక్డౌన్ కంటే ముందు ఈ సినిమాకు సంబంధించిన 80 శాతం షూటింగ్ కంప్లీటైంది. మిగిలిన 20 శాతం షూటింగ్ ఈ గురువారం నుంచి నెల రోజుల్లో కంప్లీట్ కానుంది. ఈ సినిమాను తమిళంలో హిట్టైన ‘అసురన్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్‌తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మరోసారి వెంకటేష్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్‌తో పాటు వీ క్రియేసన్స్ బ్యానర్లో కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. టెక్నికల్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సామ్.కె నాయుడు అందిస్తుండగా, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ గాంధీ నడికుడికర్, కథ వెట్రిమారన్, ఫైట్స్ పీటర్ హెయిన్స్, విజయ్, లిరిక్స్ సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంతశ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యాం రాస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి లేదా వచ్చే సమ్మర్లో విడుదల చేసే అవకాశం ఉంది.

‘నారప్ప’గా వెంకటేష్ (Twitter/Photo)
అసురన్‌లో ధనుశ్ డబుల్ రోల్లో యాక్ట్ చేసాడు. తెలుగులో మాత్రం వెంకటేష్‌తో పాటు మరో హీరోను యాక్ట్ చేస్తున్నాడు. ‘అసురున్’ చిత్ర విషయానికొస్తే.. కుల వ్యవస్థ దాని మూలంగా జరిగిన గొడవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ నేటివిటీకి ఈ కథ చక్కగా సరిపోయింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో హీరో.. ఊర్లో వాళ్ల కాళ్లు మొక్కడం.. ఆవు పేడను ధనుశ్ చేత్తో ఎత్తడం వంటి రియలిస్టిక్ సన్నివేశాలున్నాయి. తమిళ హీరోలు.. ప్రేక్షకులను అభిమానులను కాకుండా.. కథకున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆయా సన్నివేశాల్లో నటిస్తుంటారు. ధనుశ్ కూడా కథకున్న ప్రాధాన్యత ఉన్న దృష్ట్యా ఈ సన్నివేశాల్లో ఎలాంటి మొహమాటం లేకుండా నటించాడు. మరి తెలుగు ప్రేక్షకులు ఇటువంటి కథ కథనం ఉన్న చిత్రాన్ని వెంకటేష్ ఏ మేరకు చేసి మెప్పిస్తాడనేది చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 5, 2020, 9:45 PM IST