Narappa Trailer Talk: వెంకటేష్ విశ్వరూపం.. యాక్షన్స్ సీన్స్‌తో అదిరిన నారప్ప ట్రైలర్..

Narappa Official Trailer Photo : Twitter

Narappa Trailer Talk: వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ సినిమా అసురన్‌కు తెలుగు రీమేక్‌గా వస్తున్న చిత్రం 'నారప్ప'.

  • Share this:
    వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ సినిమా అసురన్‌కు తెలుగు రీమేక్‌గా వస్తున్న చిత్రం 'నారప్ప'. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 20న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల విడుదలైంది. ఇక ఎప్పుడో షూటింగ్ జరపుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో నారప్ప టీమ్ ఓటీటీ విడుదలను ఎంచుకుంది. అమెజాన్ నుంచి మంచి ఆఫర్ రావడంతో డైరెక్ట్‌గా డిజిటల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా తమిళ అసురన్ సినిమాకు రీమేక్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. ఇంటెన్స్ క్రైమ్ ఎమోషనల్ డ్రామాతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అదిరిందనే చెప్పాలి. ఏమోషనల్ సీన్స్‌లో వెంకటేష్ అదరగొట్టారు. ఒరిజినల్ వెర్షన్ కి ఎక్కడా తగ్గకుండా శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ కానీ చూపించిన విజువల్స్ కానీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే వెంకటేష్, ప్రియమణిల నటన మరో ఎత్తుకు తీసుకెళ్తుందని చెప్పోచ్చు ట్రైలర్‌ను చూస్తుంటే.. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడ అదిరింది. రెండు పాత్రల్లో వెంకీ ఇరగదీశారు. జూలై 20 వెంకటేష్ అభిమానులకు పండగే అనే చెప్పోచ్చు.

    ఇక ఈ సినిమా టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు అందిస్తుండగా, సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్నారు. ఎడిటర్ గా మార్తాండ్ కె. వెంకటేష్‌ పని చేస్తున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నారప్ప తమిళ సినిమా 'అసురన్’కు రీమేక్‌గా వస్తోంది. తమిళంలో ధనుష్ నటించిన ఆ సినిమా దళిత నేపథ్య కథతో వచ్చి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తమిళ మాతృకను వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ధనుష్‌కు జంటగా మళయాల నటి మంజు వారియర్ నటించిగా.. అదే పాత్రలో తెలుగులో ప్రియమణి కనిపించారు. ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    ఇక వెంకటేష్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన దృశ్యం 2లో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఓటీటీలో విడుదల అవుతుందని అంటున్నారు. హాట్ స్టార్‌లో డైరెక్ట్‌గా విడుదలకానుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు వెంకీ.. ఎఫ్ 3లో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: