Venkatesh Narappa movie director dissatisfaction about output and he wants reshoot
Venaktesh Narappa: వెంకటేశ్ నారప్ప సినిమా షూటింగ్ ఈ నెలాఖరుకి పూర్తవుతుందని అనుకుంటుంటే.. సినిమా రీషూట్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల వెనుక అసలు విషయమేమంటే...
సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'నారప్ప'. ఈ నెలాఖరుకు సినిమా షూటింగ్ పూర్తవుతుందని ఎంటైర్ యూనిట్ భావించింది. అయితే ఈ సినిమా ఔట్‌పుట్‌పై ఒకరు అసంతృప్తిని వ్యక్తం చేశారట. ఇంతకీ అలా అసంతృప్తిగా ఉన్నదెవరో కాదు.. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. అదేంటి? ఆయన డైరెక్ట్ చేసిన సినిమాపైనే అంత అసంతృప్తి ఎందుకు అనే సందేహం రాక మానదు. అసలు విషయం ఏంటంటే.. రీసెంట్గా నారప్ప ఔట్పుట్ చూసుకునే సమయంలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలకే కొన్ని సీన్స్ చిత్రీకరణ నచ్చలేదట. దీంతో ఆయన మళ్లీ ఆ సన్నివేశాల చిత్రీకరణను మళ్లీ రీ షూట్ చేయాలని అనుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శ్రీకాంత్ అడ్డాల పరిస్థితిని నిర్మాత సురేష్‌బాబు, కలైపులి థాను అంగీకరిస్తారా? అనేది చూడాలి.
తమిళంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం అసురన్‌కు ఇది రీమేక్. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ప్రేక్షకాభిమానుల ప్రశంసలే కాదు.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న చిత్రమిది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను తెరకెక్కించారు. గత ఏడాది సమ్మర్లోనే విడుదల కావాల్సిన నారప్ప కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు సినిమా చిత్రీకరణ పూర్తి కావస్తుంది. ఇప్పుడు ఈ సినిమా రీ షూట్ చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే, వెంకటేశ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు మరికొంత కాలం ఆగక తప్పదు.
ప్రియమణి ఇందులో వెంకటేశ్‌కు జోడీగా నటించింది. మరి ఫ్లాష్‌బ్యాక్‌లో వెంకటేశ్‌తో జోడీ కట్టిన మరో హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. భూ వివాదాలు, కుల ప్రస్తావన నేపథ్యంలో నారప్ప సినిమా రన్ అవుతుంది. బ్రహ్మోత్సవం వంటి డిజాస్టర్ తర్వాత అవకాశాలు దక్కని శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే శ్రీకాంత్ అడ్డాల కెరీర్ మరోసారి గాడిలో పడ్డట్టే అవుతుంది.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.