Venkatesh - Narappa Censor Completed : విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘నారప్ప’. ప్రియమణి హీరోయిన్గా నటించిన ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబుతో పాటు కలైపులి ఎస్.థాను ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. వెంకటేష్ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ప్రియమణి హీరోయిన్గా నటించారు. ఇతర ముఖ్యపాత్రలో రాజీవ్ కనకాల నటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ చిత్రం తమిళంలో హిట్టైన ‘అసురన్’ సినిమా రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో నటనకు గాను ధనుశ్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. మంజు వారియర్ హీరోయిన్గా నటించింది. తమిళ మాతృకను వెట్రిమారన్ దర్శకత్వం వహించారు.
అసురన్ తమిళ్లో హత్తుకునే భావోద్వేగాలతో గ్రామీణ నేపథ్యంలో సాగుతూ హృదయాలను కట్టిపడేస్తుంది. తెలుగులో కూడా ఈ సినిమాను ఎక్కడా తగ్గకుండా రూపొందిస్తున్నారు. అందులో భాగంగా సహజంగా ఉండేందుకు ఈ సినిమా షూటింగ్‌ను చాలా వరకు అనంతపురంజిల్లాలో జరిపారు. ముందుగా ఈ సినిమాను మే 14వ తేదీన విడుదల చేయాలనుకున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుత సమయంలో కరోనా తీవ్రరూపం దాల్చడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది చిత్రబృందం.
దీంతో ఈ సినిమా ఓటీటీలో విడుదలకానుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ చిత్రబృందం మాత్రం తమ సినిమా థియేటర్లోనే విడుదలకానుందని తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్.కె నాయుడు అందిస్తుండగా, సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్నారు. ఎడిటర్ గా మార్తాండ్ కె. వెంకటేష్ పని చేస్తున్నారు.మరోవైపు వెంకటేష్ ‘నారప్ప’తో పాటు ‘దృశ్యం 2’ సినిమాను కంప్లీట్ చేసారు. ఇంకోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ మూవీ చేస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ మరో కథానాయకుడిగా నటించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mani Sharma, Narappa, Srikanth Addala, Suresh Babu, Suresh Productions, Tollywood, Venkatesh