వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' పేరుతో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మే 14వ తేదీన విడుదల చేయాలనుకున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుత సమయంలో కరోనా తీవ్రరూపం దాల్చడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది చిత్రబృందం. దీంతో ఈ సినిమా ఓటీటీలో విడుదలకానుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ చిత్రబృందం మాత్రం తమ సినిమా థియేటర్లోనే విడుదలకానుందని తెలిపింది. ఇక అది అలా ఉంటే.. ఈ సినిమా గురించి ఈ చిత్ర డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘మరో వారం రోజుల్లో నారప్ప ఫస్ట్ కాపీ పూర్తి అవుతుందని, రిలీజ్ డేట్ విషయం పై చర్చిస్తున్నాం అని, త్వరలోనే నారప్ప విడుదలను అధికారికంగా ప్రకటిస్తాం అంటూ పేర్కోన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్.కె నాయుడు అందిస్తుండగా, సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్నారు. ఎడిటర్ గా మార్తాండ్ కె. వెంకటేష్ పని చేస్తున్నారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నారప్ప తమిళ సినిమా 'అసురన్’కు రీమేక్‌గా వస్తోంది. తమిళంలో ధనుష్ నటించిన ఆ సినిమా దళిత నేపథ్య కథతో వచ్చి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తమిళ మాతృకను వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ధనుష్‌కు జంటగా మళయాల నటి మంజు వారియర్ నటించిగా.. అదే పాత్రలో తెలుగులో ప్రియమణి కనిపించనుంది. అసురన్ తమిళ్లో హత్తుకునే భావోద్వేగాలతో గ్రామీణ నేపథ్యంలో సాగుతూ హృదయాలను కట్టిపడేస్తుంది. తెలుగులో కూడా ఈ సినిమాను ఎక్కడా తగ్గకుండా రూపొందిస్తున్నారు. అందులో భాగంగా సహజంగా ఉండేందుకు ఈ సినిమా షూటింగ్‌ను చాలా వరకు అనంతపురంజిల్లాలో జరిపారు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.