హోమ్ /వార్తలు /సినిమా /

వెంకీ మామ సినిమా ట్విట్టర్ రివ్యూ..

వెంకీ మామ సినిమా ట్విట్టర్ రివ్యూ..

వెంకీ మామ (Twitter/Photo)

వెంకీ మామ (Twitter/Photo)

Venky Mama Twitter Review : విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించిన మల్టీస్టారర్ సినిమా.. వెంకీ మామ. నిజ జీవితంలో మామా అల్లుళ్లు అయిన వీరిద్దరు వెండితెరపైనా మామా అల్లుళ్లుగా నటించారు.

విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించిన మల్టీస్టారర్ సినిమా.. వెంకీ మామ. నిజ జీవితంలో మామా అల్లుళ్లు అయిన వీరిద్దరు వెండితెరపైనా మామా అల్లుళ్లుగా నటించారు. ఎఫ్2 తర్వాత వెంకటేశ్ నటించిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే ఈ దగ్గుబాటి హీరో కామెడీ, యాక్షన్ సీన్లతో కావాల్సినంత వినోదాన్ని అందిస్తాడు. అయితే.. ఈ రోజు ఇండియాలో విడుదల కానున్న సినిమాపై ఇప్పటికే ట్విట్టర్ రివ్యూలు ప్రారంభమయ్యాయి. అమెరికాలో ఇప్పటికే సినిమా విడుదలైంది. అక్కడ సినిమాను చూసిన సినీ ప్రేక్షకులు సినిమాపై ట్విట్టర్‌లో రివ్యూలు ఇస్తున్నారు.

తమకు తోచినట్లుగా స్పందిస్తూ సినిమాపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కొందరు సినిమా బాగుందని, ఇంకొందరు యావరేజ్‌గా ఉందని అంటుంటే.. మరికొందరు సినిమా వెంకటేశ్ వన్ మ్యాన్ షోగా నిలిచిందని చెబుతున్నారు. ఎఫ్2 సినిమాలోలాగే అభిమానులను ఎంజాయ్ చేయించాడని అంటున్నారు. అటు నాగ చైతన్య కూడా బాగానే చేశాడని, అయితే మామ ముందు తేలిపోయాడని అంటున్నారు.

అటు.. హీరోయిన్లు పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదని చెబుతున్నారు. తమన్ సంగీతం మాత్రం బాగుందని కితాబు ఇస్తున్నారు. అయితే.. తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని ఈ సినిమా అందిస్తుందని చెబుతున్నారు కొందరు ప్రేక్షకులు. కాకపోతే, సంక్రాంతి బరిలో కాకుండా, వెంకటేశ్ బర్త్‌డే రోజున రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.First published:

Tags: Bobby, Naga Chaitanya Akkineni, Payal Rajput, Raashi Khanna, Suresh Babu, Suresh Productions, Telugu Cinema, Thaman, Tollywood, Venkatesh, Venky Mama

ఉత్తమ కథలు