విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించిన ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రం.. వెంకీ మామ. నిజ జీవితంలో మామా అల్లుళ్లు అయిన వీరిద్దరు వెండితెరపైనా మామా అల్లుళ్లుగా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘ప్రేమమ్’ సినిమాలో కాసేపు మామా అల్లుళ్లుగా వెండితెరపై అలరించిన వీళ్లిద్దరు ఇపుడు పూర్తిస్థాయిలో ‘వెంకీమామ’గా పలరించారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తే.. నాగ చైతన్య సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సురేష్ బాబు, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి నిర్మించాడు. ‘పవర్’, ‘సర్ధార్ గబ్బర్ సింగ్’, ‘జై లవకుశ’ తర్వాత దర్శకుడు బాబీ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు.

‘వెంకీ మామ’ పోస్టర్ (Twitter/Photo)
ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. అక్కడ ఈ సినిమాను మంచి టాకే వచ్చిందని చెబుతున్నారు. మాస్ ఆడియన్స్‌కు నచ్చేలా దర్శకుడు బాబీ ఈ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచినట్టు టాక్. వెంకటేష్, చైతూ కాంబినేషన్ ఈ సినిమాను ప్లస్ కానుంది. ఈ సినిమాలో వెంకటేష్ రైతు పాత్రలో నటిస్తే.. నాగ చైతన్య సైనికుడి పాత్రలో నటించాడు.ఓవరాల్‌గా ఓ సారి చూసే యాక్షన్ ఫ్యామిలీ డ్రామా అని చెబుతున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:December 13, 2019, 08:07 IST