వెంకటేష్, నాగ చైతన్య ‘వెంకీ మామ’ సెన్సార్ పూర్తి... టాక్ ఎలా ఉందంటే..

వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించిన సినిమా ‘వెంకీ మామ’. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.

news18-telugu
Updated: December 10, 2019, 11:04 AM IST
వెంకటేష్, నాగ చైతన్య ‘వెంకీ మామ’ సెన్సార్ పూర్తి... టాక్ ఎలా ఉందంటే..
వెంకీ మామ (Twitter/Photo)
  • Share this:
ఈ యేడాది విక్టరీ హీరో వెంకటేష్.. ఎఫ్ 2 మూవీతో సక్సెస్ అందుకున్నాడు. మరోవైపు నాగ చైతన్య కూడా పెళ్లి తర్వాత సమంత ఫస్ట్ టైమ్ కలిసి నటించిన ‘మజిలీ’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. సక్సెస్ ఇచ్చి కిక్‌తో నిజ జీవితంలో  మామ మేనళ్లైన వెంకటేష్, నాగ చైతన్యలు పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘వెంకీ మామ’. బాబీ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ కంప్లీట్ అయింది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ సినిమా నిడివి 149.23 నిమిషాలు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగ చైతన్యకు జంటగా రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటించారు.ఈ సినిమాను చూసి సెన్సార్ వాళ్లు.. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టోరీ సినిమా రాలేదని చిత్ర నిర్మాతలను ప్రత్యేకంగా అభినందించినట్టు సమాచారం. అంతేకాదు చిత్ర యూనిట్‌కు స్పెషల్‌గా శుభాకాంక్షలు తెలియజేసారు.

venkatesh naga chaitanya venky mama censor completed,venky mama censor report,venky mama,venky mama movie,venky mama trailer,venky mama press meet,venky mama movie release date,venky mama censor review,venky mama movie censor review,shakeela fires on censor board,venky mama songs,venky mama jukebox,venky mama movie songs,venky mama audio songs,venky mama movie new updates,venky mama movie trailers,ram gopal varma,venky mama speech maharshi,venkatesh,naga chaitanya,suresh babu,tollywood,telugu cinema,వెంకీమామ,వెంకీ మామ,వెంకీ మామ సెన్సార్ కంప్లీట్,వెంకటేష్ నాగ చైతన్య వెంకీ మామ,బాబీ,సురేష్ బాబు
దర్శకుడు బాబీ, మ్యూజిక్ దర్శకుడు తమన్‌తో వెంకటేష్ (twitter/Photo)


పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన  ఈ చిత్రంలో వెంకటేష్..రైతు పాత్రలో నటిస్తే.. నాగ చైతన్య జవాన్ పాత్రలో యాక్ట్ చేసారు. ‘ప్రేమమ్’ తర్వాత మరోసారి ఈ సినిమాలో వెంకటేష్, నాగచైతన్య వాళ్ల నిజ జీవిత పాత్రలనే చేయడం విశేషం.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 10, 2019, 11:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading