వెంకటేష్ బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే బహుమతి..
ఈ యేడాది ‘ఎఫ్ 2’ సినిమాతో వరుణ్ తేజ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్.. తాజాగా తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాను వెంకటేష్ పుట్టినరోజున విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
Updated: November 2, 2019, 7:52 PM IST

వెంకీ మామలో వెంకటేష్, నాగ చైతన్య (twitter/Photo)
- News18 Telugu
- Last Updated: November 2, 2019, 7:52 PM IST
గత కొన్నేళ్లుగా వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు. ఈ యేడాది ‘ఎఫ్ 2’ సినిమాతో వరుణ్ తేజ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్.. తాజాగా తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ రైతు పాత్రలో నటిస్తే.. నాగ చైతన్య.. జవాన్ పాత్రలో నటిస్తున్నాడు. జై జవాన్..జై కిసాన్ నేపథ్యంలో దర్శకుడు బాబీ (కే.యస్.రవీంద్ర) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. . నిజ జీవితంలో మామా అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య ఇప్పుడు స్క్రీన్ పై కూడా అలాగే నటిస్తున్నారు. టైటిల్ కూడా పాజిటివ్‌గా ఉండటంతో ముందు నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అటు దగ్గుపాటి.. ఇటు అక్కినేని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనకున్నారు. అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంలో డిసెంబర్ 20న రిలీజ్ చేయాలన్నారు. ఆ డేట్లో కూడా మూడు సినిమాలు పోటీకి ఉండటంతో తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 13న రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఆరోజు విక్టరీ హీరో వెంకటేష్ పుట్టినరోజు. ఇప్పటి వరకు వెంకటేష్ నటించిన ఏ సినిమా ఆయన పుట్టిన రోజు విడుదల కాలేదు. అందుకే డిసెంబర్ 13న వెంకీ మామ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆ డేట్లో మరే సినిమా పోటీలో లేదు. అందుకే అదేరోజున రావాలని ఫిక్స్ అయినట్టు సమాచారం.

వెంకీ మామా వినాయక చవితి పోస్టర్ (Source: Twitter)