Home /News /movies /

VENKATESH MEENAS DRISHYAM 2 MOVIE MAJOR UPDATE HERE ARE THE DETAILS TA

Venkatesh - Drishyam 2 : విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం 2’ మూవీపై క్రేజీ అప్‌డేట్..

దృశ్యం 2 టీమ్  Photo : Twitter

దృశ్యం 2 టీమ్ Photo : Twitter

Venkatesh - Drishyam 2 : విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం 2’ మూవీపై క్రేజీ అప్‌డేట్ ఇవ్వనున్నట్టు చిత్ర యూనిట్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. 

    Venkatesh - Drishyam 2 : విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం 2’ మూవీపై క్రేజీ అప్‌డేట్ ఇవ్వనున్నట్టు చిత్ర యూనిట్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రకటించింది.  ఈ యేడాది వెంకటేష్ తమిళ సూపర్ హిట్ ‘అసురన్’ మూవీని ‘నారప్ప’గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా విడుదల చేసారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో పాటు వెంకటేష్ మలయాళంలో మోహన్ లాల్ హీరోగా మీనా హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన ‘దృశ్యం 2’ సినిమాను అదే టైటిల్‌తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఎపుడో ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. దాదాపు 8 యేళ్ల క్రితం విడుదలైన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్‌గా  ఈ సినిమా తెరకెక్కింది.

    ఇక వెంకటేష్ కూడా మోహన్‌లాల్ నటించిన అప్పటి సూపర్ హిట్ ‘దృశ్యం’ చిత్రాన్ని అదే టైటిల్‌తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ మూవీని అదే టైటిల్‌తో రీమేక్ చేసారు. ఈ సినిమాను కూడా నారప్ప తరహాలోనే ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి ఈ శనివారం ఉదయం 11.07 నిమిషాలకు  కీలక ప్రకటన చేయనున్నట్టు ట్వీట్ చేశారు.



    దృశ్యం2ను దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను డిస్నీ+హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. ఈ సినిమాను సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించారు.

    Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

    దృశ్యం 2 చిత్ర బృందం షూటింగ్‌ను కేవలం 47 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశారు. వెంకటేష్, మీనా జంటగా నటించారు. నదియా కీలకపాత్రలో కనిపించనుంది. మలయాళంలో ఒరిజినల్ వెర్షన్‌ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌ తెలుగు వెర్షన్‌కి కూడా దర్శకత్వం వహించారు.

    NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

    ఇక వెంకటేష్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్ర‌స్తుతం ఎఫ్3 సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎఫ్ 2‌కు సీక్వెల్‌గా వస్తోంది. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తమన్నా, మెహ్రీన్, అంజలి ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Drishyam 2, Jeethu Joseph, Meena, Suresh Productions, Tollywood, Venkatesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు