Venkatesh - Nagararjuna: వెంకటేష్ కళ్లు తెరిపించిన నాగార్జున.. అందుకే విక్టరీ హీరో సంచలన నిర్ణయం..

వెంకటేష్,నాగార్జున (Twitter/Photo)

Venkatesh - Nagararjuna: వెంకటేష్ కళ్లు తెరిపించిన నాగార్జున.. అందుకే విక్టరీ హీరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Venkatesh - Nagararjuna: వెంకటేష్ కళ్లు తెరిపించిన నాగార్జున.. అందుకే విక్టరీ హీరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఈ ఇయర్  నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమాను ముందుగా ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. తీరా థియేటర్స్ ఓపెన్ కావడం.. క్రాక్, ఉప్పెన, జాతి రత్నాలు వంటి సినిమాలకు కలెక్షన్లు బాగా రావడంతో నాగార్జునతో పాటు నిర్మాత ఈ సినిమాను ఓటీటీ ఆఫర్ కాదని మరి థియేటర్స్‌లో ‘వైల్డ్ డాగ్’ సినిమాను విడుదల చేసారు. ఈ మూవీకి టాక్ బాగున్నా.. ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో వస్తే చూద్దాంలే అనుకొని లైట్ తీసుకున్నారు. ఇక ఈ సినిమాను రూ. 9 కోట్లకు అమ్మితే.. కనీసం రూ. 3.50 కోట్లు మాత్రమే రాబట్టి డబుల్ డిజాస్టర్‌గా నిలిచి హీరోగా నాగార్జున ఉనికిని ప్రశ్నించేలా చేసింది. మొత్తంగా ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే.. రూ. 22 కోట్ల అన్న దక్కేవి. ఓటీటీ డీల్ కాన్సిల్ చేసుకున్నందకు సగానికి సగం రేటుకే నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. దీంతో ఇపుడు వెంకటేష్ తను నటించిన తాజా చిత్రం ‘నారప్ప’ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయడానికి ముందుకొచ్చారు.

    ‘నారప్ప’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాను తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేసారు. ఈ సినిమాను మే 14న థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తీరా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అన్ని సినిమాల మాదిరే ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ చేసినా.. ప్రేక్షకులు సినిమా హాలుకు వచ్చి చూస్తారన్న నమ్మకం లేకుండా పోయింది. దీంతో ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ రూ. 35 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించింది. దీంతో నిర్మాతలైన సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను కూడా ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. ఇక వెంకటేష్ కెరీర్‌లో ఓ సినిమా ఇలా థియేటర్స్‌లో కాకుండా.. నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

    Venkatesh - Nagararjuna: వెంకటేష్ కళ్లు తెరిపించిన నాగార్జున.. అందుకే విక్టరీ హీరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
    అమెజాన్ ప్రైమ్‌లో ‘నారప్ప’ (Twitter/Photo)


    వెంకటేష్ మిగతా సినిమాల విషయానికొస్తే..   మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన దృశ్యంను ఆయన ఇదివరకే తెలుగులో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. తాజాగా  ‘దృశ్యం 2’ ను రీమేక్ చేసారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీటై  ఫస్ట్ కాపీ కూడా రెడీ అయింది.  ఆల్రెడీ మళయాళంలో హిట్ అయిన ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి. అక్కడ ఈ సినిమా థియేటర్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులో కూడా తెరకెక్కించారు.

    Venkatesh - Drishyam 2 Telugu Remake Will Streming On OTT Platform Here Are The Details,Venkatesh - Drishyam 2: వెంకటేష్ ‘దృశ్యం 2’ ఓటీటీ విడుదల చేయనున్నారా.. ?,Venkatesh Drishyam 2 Telugu Remake Release on OTT Platform,Dirshyam 2 Telugu OTT Platform,Drishyam 2 telugu news, venkatesh drishyam 2 shooting, drishyam 2 telugu shooting, drishyam 2 telugu, venkatesh drishyam 2,venkatesh drishyam 2 remake,venkatesh drishyam 2 telugu remake,mohanlal venkatesh drishyam 2,venkatesh drishyam 2 jeethu joseph,venkatesh confirmed drishyam 2 remake,telugu cinema,దృశ్యం 2,దృశ్యం 2 తెలుగు రీమేక్,వెంకటేష్ దృశ్యం 2 తెలుగు రీమేక్,ఓటీటీలో విడుదల కానున్న దృశ్యం 2 మూవీ,ఓటీటీలో రిలీజ్ కానున్న వెంకటేష్ దృశ్యం 2

    దృశ్యం 2లో వెంకటేష్(Twitter/Photo)అనుకోకుండా జరిగిన ఓ మర్డర్ నుండి తన ఫ్యామిలీని ఎలా హీరో కాపాడుకున్నారు.  అనేది కథ. ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ ప్రేక్షకులను తెగ ఆకట్టకుంది. ఇక ఈ దృశ్యం 2 సినిమాను తెలుగులో సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. మీనా, వెంటకేష్ ప్రధాన పాత్రలు చేస్తుండగా.. నదియా మరో కీలకపాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా.. నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. త్వరలో అధికారికగా ప్రకటన వెలుబడనుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: