• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • VENKATESH JEETHU JOSEPH DRISHYAM 2 TELUGU SHOOT TO START FROM MARCH 8 PRODUCED BY SURESH PRODUCTIONS SR

Drishyam 2: మార్చి 8 నుంచి మొదలుకానున్న వెంకటేష్ జీతూ జోసెఫ్ దృశ్యం 2 షూటింగ్..

Drishyam 2: మార్చి 8 నుంచి మొదలుకానున్న వెంకటేష్ జీతూ జోసెఫ్ దృశ్యం 2 షూటింగ్..

Venkatesh Drishyam 2 Photo : Twitter

Drishyam 2: ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్ తాజాగా నటించిన చిత్రం దృశ్యం 2. ఈ సినిమా 2013లో వచ్చిన దృశ్యంకు సీక్వెల్’గా వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ కానుంది.

  • Share this:
    ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్ తాజాగా నటించిన చిత్రం దృశ్యం 2. ఈ సినిమా 2013లో వచ్చిన దృశ్యంకు సీక్వెల్’గా వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ కానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయినా ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ట్విస్ట్‌లు, కథనం ప్రేక్షకుల్నీ కట్టిపడేశాయి. అనుకోకుండా జరిగిన ఓ మర్డర్ నుండి తన ఫ్యామిలీని ఎలా హీరో కాపాడుకున్నాడు అనేది కథ. సినిమాలో మీనా, మోహల్ లాల్ అదరగొట్టారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయ్యింది. ఇక అదే సినిమాను తెలుగులో వెంకటేష్ 2014లో రీమేక్ చేశాడు. దృశ్యం మాతృకను జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేయగా.. తెలుగులో శ్రీప్రియ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. ఇక ఇటీవల ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా లేటెస్ట్ దృశ్యం 2 ఫిబ్రవరి 19, 2021న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ ప్రేక్షకులను తెగ ఆకట్టకుంటోంది. ఈ దృశ్యం 2 సినిమాను ఆషిర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించాడు. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందనను దక్కించుకుంటోంది. ముఖ్యంగా జార్జ్ కుట్టి పాత్రలో మోహన్ లాల్ నటనకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో ఇతర నటీనటుల కూడా మనసును దోచే విధంగా నటించి అదరగొట్టారు. ఇక ఈ సినిమాలో మోహల్ లాల్‌తో పాటు ఇతర పాత్రల్లో.. మీనా, ఎస్తేర్ అనిల్, అన్సిబా హసన్, ఆశా శరత్, సిద్దిక్, మురళి గోపీ, కృష్ణ, సాయి కుమార్, జిబి గణేష్ కుమార్, అనీష్ జి మీనన్, కోజికోడ్ నారాయణన్ నాయర్ తదితరులు నటించారు.

    ఇక ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేయనున్నాడు. దృశ్యం 2 మ‌ల‌యాళ సినిమాను చూసిన వెంకీ తెలుగు దృశ్యంకు సీక్వెల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌పై సురేష్ బాబు నిర్మించ‌నున్నాడు. ప్ర‌స్తుతం వెంకటేష్ ఎఫ్3 షూటింగ్‌‌లో పాల్గోంటున్నాడు. అటు ఆ సినిమాల్లో నటిస్తూనే.. దృశ్యం 2 షూట్‌లో కూడా పాల్గొన‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక వెంకీ మరో సినిమా నారప్ప మే 14న విడుద‌ల కాబోతుంది. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల‌ దర్శకత్వం వహించాడు.



    మలయాళంలో హిట్టయిన 'దృశ్యం 2' చిత్రాన్ని తెలుగులో షూటింగ్ మార్చి 8 నుంచి మొదలుకానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్, మీనా జంటగా నటించనున్నారు. ఇక ఇతర కీలక పాత్రలలో నరేష్, నదియా తదితరులు నటించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు