మలయాళంలో 2013లో విడుదలైన ఒక సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇండియన్ సినిమాకు ఇంత క్రేజ్ ఉందా అనే రీతిలో ఆ చిత్రం సంచలనాలు తిరగరాసింది. దాని పేరు దృశ్యం. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. పూర్తిగా ఎమోషనల్ కథకు మర్డర్ మిస్టరీని జోడించి జీతూ రాసుకున్న స్క్రీన్ ప్లేకు ఇండియా అంతా ఫిదా అయిపోయింది. ఎందుకంటే ఆ తర్వాత తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీలో కూడా రీమేక్ అయింది దృశ్యం. ప్రతీ భాషలో కూడా సినిమా విజయం సాధించింది. చైనీస్ భాషలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా కూడా నిలిచింది దృశ్యం. ఈ ఏడాది మొదట్లో దృశ్యం సినిమాకు సీక్వెల్ పూర్తి చేసాడు జీతూ. తొలిభాగంలో నటించిన వాళ్లంతా రెండో భాగంలోనూ కంటిన్యూ అయ్యారు. మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోను పెట్టుకుని సినిమాను కేవలం 46 రోజుల్లోనే పూర్తి చేసాడు దర్శకుడు. ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది.
ఇప్పుడు ఈ సినిమా తెలుగు రీమేక్ కూడా రెడీ అయిపోయింది. నవంబర్ 25న ఈ సినిమా నేరుగా ఓటిటిలోనే విడుదల కానుంది. థియేటర్స్ ఓపెన్ అయినా కూడా ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు. దృశ్యం కథ ఎక్కడైతే ముగిసిందో అక్కడ్నుంచే రెండో భాగం మొదలు కానుంది. ట్రైలర్‌లోనూ అదే చూపించాడు దర్శకుడు జీతూ జోసెఫ్. తొలిభాగంలో నటించిన వాళ్లే.. దృశ్యం 2లోనూ కనిపించారు.
Rambabu is back! Can he pull an ♠️ up his sleeves again or will he succumb to the challenge?
Trailer out now.
Watch #Drushyam2OnPrime on Nov 25@VenkyMama #MeenaSagar #JeetuJoseph @SureshProdns @aashirvadcinema @antonypbvr @anuprubens #SatheeshKurup @_estheranil @sripriya pic.twitter.com/z2Pc9eWKFd
— amazon prime video IN (@PrimeVideoIN) November 15, 2021
రెండో భాగంలో మర్డర్ కేసును మరోసారి తిరగతోడుతున్నారు. మొదటి భాగంలో వెంకటేష్ కుటుంబం ఓ కుర్రాడిని చంపేస్తారు. తన కుటుంబాన్ని కాపాడుకోడానికి ఆ శవాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లోనే పాతి పెడతాడు వెంకీ. ఇప్పుడు రెండో భాగం అక్కడ్నుంచే మొదలవుతుంది. కేసును మళ్లీ రీ ఓపెన్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది అసలు కథ. మళ్లీ పోలీసులు వెంకటేష్ ఇంటికి రావడం.. అక్కడ్నుంచి ఇంటరాగేషన్.. అలా క్లైమాక్స్‌లో ఏమవుతుంది అనేది అసలు కథ. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆసక్తికరంగానే అనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Drishyam 2, Hero venkatesh, Meena, Telugu Cinema, Tollywood