Venkatesh: వెంకటేష్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చిన మోహన్ లాల్..

Venkatesh Mohanlal: అదేంటి.. వెంకటేష్ తెలుగు హీరో.. మోహన్ లాల్ మలయాళం హీరో కదా.. ఆయనకేంటి సమస్య అనుకుంటున్నారా..? ఇది సినిమా ఇండస్ట్రీ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 21, 2020, 9:56 PM IST
Venkatesh: వెంకటేష్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చిన మోహన్ లాల్..
వెంకటేష్ మోహన్ లాల్ (venkatesh mohanlal)
  • Share this:
అదేంటి.. వెంకటేష్ తెలుగు హీరో.. మోహన్ లాల్ మలయాళం హీరో కదా.. ఆయనకేంటి సమస్య అనుకుంటున్నారా..? ఇది సినిమా ఇండస్ట్రీ. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ చెప్పినట్లు ఇక్కడంతా బటర్ ఫ్లై థియరీ అప్లై అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మోహన్ లాల్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు వెంకటేష్‌కు షాక్ ఇచ్చింది. అదేంటంటే ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమా.. దాని పేరు దృశ్యం 2. కొన్ని సినిమాలకు యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. అలాంటి సినిమానే దృశ్యం కూడా.
వెంకటేష్ మోహన్ లాల్ (venkatesh mohanlal)
వెంకటేష్ మోహన్ లాల్ (venkatesh mohanlal)


ఇది మలయాళంలో 2013లో విడుదలైంది. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. పూర్తిగా ఎమోషనల్ కథకు మర్డర్ మిస్టరీని జోడించి జీతూ రాసుకున్న స్క్రీన్ ప్లేకు ఇండియా అంతా ఫిదా అయిపోయింది. ఎందుకంటే ఆ తర్వాత తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీలో కూడా రీమేక్ అయింది దృశ్యం. ప్రతీ భాషలో కూడా సినిమా విజయం సాధించింది. చైనీస్ భాషలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా కూడా నిలిచింది దృశ్యం.
మోహన్‌లాల్ (Twitter/Photo)
మోహన్‌లాల్ (Twitter/Photo)

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు మోహన్ లాల్. ఇప్పటికే జీతూ జోసెఫ్ చెప్పిన కథ కథనాలు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడు మోహన్ లాల్. ఈ చిత్ర సీక్వెల్‌ ఆగస్ట్ 17న ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. దాంతో సెప్టెంబర్ 21న పూజా కార్యక్రమాలు ముగించుకొని షూటింగ్ కూడా ప్రారంభించారు. షూటింగ్ అంతా సింగిల్ షెడ్యూల్‌లోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు జీతూ జోసెఫ్.
మోహన్ లాల్ (Mohanlal death fake news)
మోహన్ లాల్ (Mohanlal)

మరోవైపు మోహన్ లాల్ కూడా ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చేసాడు. దాంతో ఈ సినిమా కోసం మోహన్‌ లాల్ అభిమానులు వేయికళ్ళతో వేచి చూస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే అప్పుడు ముగిసిన కథనే ఇప్పుడు కొనసాగిస్తున్నాడా లేదంటే కొత్త కథను తీసుకొస్తున్నాడా అనేది మాత్రం అర్థం కావడం లేదు.
మోహన్ లాల్ (Mohanlal death fake news)
మోహన్ లాల్ (Mohanlal)

అది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారు.. మీనా కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే దృశ్యం 2 సినిమాను తెలుగులో అనువదించి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు మోహన్ లాల్. దాంతో వెంకటేష్‌కు రీమేక్ ఛాన్స్ లేకుండా పోయింది. తెలుగులో డబ్బింగ్ చేయకపోతే కచ్చితంగా వెంకీకి మంచి సినిమా వచ్చుండేది.. కానీ మోహన్ లాల్ మాత్రం అలాంటి ఆశలేం పెట్టుకోవద్దని చెప్పేస్తున్నాడు.
Published by: Praveen Kumar Vadla
First published: September 21, 2020, 9:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading