Home /News /movies /

VENKATESH FUN WITH BITHIRI SATHI INTERVIEW ANIL RAVIPUDI NONSTOP SMILING SB

బిత్తిరి సత్తికి షాక్ ఇచ్చిన వెంకటేష్.. వెంకీతో ఆడుకోవద్దంటున్న నెటిజన్స్

బిత్తిరి సత్తిని ఆడుకున్న వెంకటేష్

బిత్తిరి సత్తిని ఆడుకున్న వెంకటేష్

బిత్తిరి సత్తిని ఇమిటేట్ చేస్తూ... అచ్చు అలాగే డైలాగ్స్ దింపేశాడు. తాను ముందు నుంచి కూడా ఫల్టీ స్టారర్ సినిమాలు చేశానని.. తనకు ఫల్టీ స్టారర్ మూవీ చేయడంచాలా ఇష్టమన్నారు.

    అనిల్ రావిపూడి డైరెక్షన‌లో వెంకటేష్,వరుణ తేజ్ నటంచిన ఎఫ3 సినిమా ఇవాళ విడుదల కానుంది. అయితే ఈ క్రమంలో ఎఫ్3 టీం ప్రమోషన్లలో పాల్గొంది. బిత్తిరి సత్తితో  వెంకటేష్,వరుణ తేజ్,అనిల్ రావిపూడి స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక బిత్తిరి సత్తి చేసే ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో తెలిసిందే. ప కు బదులుగా ఫ అని పలుకుతుంటాడు సత్తి. వెంకటేష్‌ను ఇంటర్వ్యూ చేస్తూ.. ఒకప్పుడు పండగలకు మీ సినిమాలు రిలీజ్ అయ్యేవి..ఇప్పుడు ఫ(మ)ల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు అంటూ.. బిత్తిరి సత్తి వెంకీను అడుగుతుంటాడు. దీనికి వెంటనే... వెంకీ స్పందిస్తూ.. స్పాంటేనియస్‌గా ఆన్సర్ ఇచ్చారు.

    బిత్తిరి సత్తిని ఇమిటేట్ చేస్తూ... అచ్చు అలాగే డైలాగ్స్ దింపేశాడు. తాను ముందు నుంచి కూడా ఫల్టీ స్టారర్ సినిమాలు చేశానని.. తనకు ఫల్టీ స్టారర్ మూవీ చేయడంచాలా ఇష్టమన్నారు. నేను ఏం ఫాఫం చేశానో కాని.. చాలా ఫల్టీ స్టారర్ సినిమాలు చేశానన్నాడు. కానీ తాను చేసిన అన్నీ ఫల్టీ స్టారర్ సినిమాలు అన్నీ కూడా బాగా ఆడేశాయని... ఫెంటాస్టిక్‌అని వెంకటేష్ అంటూ.. బిత్తిరి సత్తినే ఆడేసుకున్నాడు. ఇక వెంకీ బిత్తిరి సత్తిని ఆడుకుంటుంటే పక్క సీట్లో కూర్చొన్న ఎఫ్3 డైరెక్టర్ అనిల్ రావిపూడి పడి పడి నవ్వుతూనే ఉన్నాడు. ఇక సోషల్ మీడియలో ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలను చూసిన.. నెటిజన్లు కూడా నవ్వి నవ్వి చస్తున్నారు.



    వెంకీ సార్ టైమింగ్ అంటూ.. ఓ నెటిజన్ పోస్టు చేయగా... మరో నెటిజన్ వెంకీ మామతో మామూలుగా ఉండదు మరి అంటూ మరొకరు కామెంట్ చేశారు. బిత్తిరి సత్తి లాంగ్వేజ్ కూడా ఫల్టీ కొట్టాడు అంటూ పలువురు నెటిజన్లు నవ్వుతు ఉండే ఎమోజీలను పోస్టు చేస్తున్నారు.

    మరోవైపు విడుదలకు ఒకరోజు ముందు ఎఫ్‌3 నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. గురువారం నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఎఫ్‌3 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన దిల్‌ రాజు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ అంశాన్ని తెలిపారు. ఎఫ్‌3లో పవన్‌ కళ్యాణ్‌ కనిపించనున్నట్లు దిల్‌రాజు తెలిపారు. కేవలం పవన్‌ మాత్రమే కాకుండా టాలీవుడ్‌కు చెందిన టాప్‌ స్టార్స్‌ సినిమాలో కనిపించేటట్లు అనిల్ ఓ ఎపిసోడ్‌ను క్రియేట్‌ చేశాడని దిల్‌రాజు తెలిపారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Anil Ravipudi, F3 Movie, Victory venkatesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు