రివ్యూ: దృశ్యం 2
నటీనటులు: వెంకటేష్, మీనా, నరేష్, నదియా, సంపత్ రాజ్, తనికెళ్ల భరణి, జయ కుమార్, ఎస్తేర్ అనిల్ తదితరులు..
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాతలు: డి. సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి, ఆంటోని పెరంబవూర్
దర్శకుడు: జీతూ జోసెఫ్
విక్టరీ వెంకటేష్, మీనా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్‌గా తాజాగా ‘దృశ్యం 2’ మూవీ తెరకెక్కింది. ఇక మలయాలంలో ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ రెండో భాగాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా విడుదల చేసారు. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ..
కథ విషయానికొస్తే.. మలయాళంలో మోహన్‌లాల్, మీనా ప్రధానా పాత్రలో 2013లో విడుదలైన ఒక సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ఆ తర్వాతా ఆయా భాషల్లో రీమేకై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. మొదటి భాగం ఎక్కడైతే.. ముగిసిందో.. అక్కడ నుండో రెండో భాగం మొదలవుతోంది. మొదటి భాగంలో తన కూతురును లైంగికంగా వేధించిన వరుణ్‌ను అనుకోకుండా చనిపోతాడు. అతని శవాన్ని ఎవరికీ తెలియకుండా పోలీస్ స్టేషన్‌లో పాతి పెడతారు. ఈ సందర్భంగా సాక్ష్యాలు చేస్తారు. ఐతే.. కుమారుడు కనిపించకుండా పోయి ఆరేళ్లు అవుతున్న సందర్భంగా నరేష్, నదియా తమ కొడుకు ఎలా ఏమై పోయాడనే ఆలోచనలో బతుకుతూ ఉంటారు. ఈ సందర్భంగా ఈ కేసును ఓ పోలీస్ అధికారికి అప్పగిస్తారు. అతనికి రాంబాబు (వెంకటేష్) వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలు లభిస్తాయి. మరి ఈ సారి రాంబాబు తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడనేదే ‘దృశ్యం 2’ మూవీ స్టోరీ.
కథనం
భారతీయ సినిమాకు ఇంత క్రేజ్ ఉందా అనే రీతిలో ‘దృశ్యం’ సినిమా ఎన్నో సంచలనాకు వేదికగా నిలిచింది. ఇక దృశ్యం 2 రెండో భాగాన్ని కూడా అంతే పకడ్బందీగా తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు జీతూ జోసెఫ్. ఆల్రెడీ మోహన్‌లాల్ తో చేసిన కథను తెలుగులో అదే దర్శకుడు తెరకెక్కించారు. మొదట కొంత భాగం బోర్ కొట్టించినా.. సినిమా ప్రారంభమైన 40 నిమిషాల తర్వాత కథలో వేగం పెరుగుతోంది. రెండో భాగంలో వెంకటేష్ ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడు. ఆ తర్వాత వెంకటేష్ తన ఫ్యామిలీని కాపాడనే ఎమోషనల్‌తో ‘దృశ్యం 2’ ఎంతో ఎమోషనల్‌గా సాగింది. మొత్తంగా జీతూ జోసెఫ్.. రెండో భాగానికి అద్భుతమైన సన్నివేశాలతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నారు. మొత్తంగా ‘దృశ్యం’ మాదిరే ‘దృశ్యం 2’ కూడా ప్రేక్షకులను అలరిస్తోందనే చెప్పాలి.
నటీనటులు
విక్టరీ హీరో వెంకటేష్ నటన గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ఇప్పటికే ‘దృశ్యం’లో తన నటనతో అదరగొట్టిన వెంకీమామ.. ‘దృశ్యం 2’లో అదే టెంపోను కంటిన్యూ చేసారు. తన పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించారు. మీనా కూడా రాంబాబు భార్య జ్యోతి పాత్రలో మరోసారి రాణించింది. ఇతర పాత్రల్లో నటించిన నదియా, సీనియర్ నరేష్, సంపత్ రాజ్, తనికెళ్ల భరణి తమ పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ టీమ్
‘దృశ్యం 2’ సినిమాకు దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వ ప్రతిభకు కెమెరామెన్ సతీష్ కురూప్ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్..
కథ
నటీనటుల నటన
స్క్రీన్ ప్లే, కెమెరా పనితనం
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ కొంచెం బోరింగ్..
అక్కడ లోపించి సస్పెన్స్
చివరి మాట..
దృశ్యం 2 .. కంప్లీట్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్
రేటింగ్.. 2.74/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Drushyam Movie Review, Drushyam-2, Meena, Venkatesh